ఫొటోల కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు
అక్షర కిరణం, (విశాఖపట్నం): యువత సోషల్ మీడియాలో హైప్ తెచ్చుకోవడానికి తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. అడ్వంచర్ జర్నీలు ఉండాలి గానీ.. ముందు వెనుకా చూసుకోకుండా వెళ్లకూడదు. రిజర్వాయర్ వద్ద పెద్ద గొయ్యి ఏర్పడిందని.. అక్కడ ఫొటోలు తీసుకోవడానికి వెళ్లిన యువకులు ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నారు. ఫొటోషూట్ చేస్తూ అదుపు తప్పి అందులో పడిపోయారు. ఈ ఘటన విశాఖ పరిధిలోని చింతగట్ల మేహాద్రి రిజర్వాయర్ వద్ద చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఎనఏడీ కొత్త రోడ్డులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న గంటా దీపక్ (17), గన్నవరపు రామచంద్ర రావు(17) మరో నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి.. చింతగట్ల సమీపంలో మేహాద్రి రిజర్వాయర్ వద్ద ఓ చోట గొయ్యి పడితే అక్కడ ఫొటోలు దిగేందుకు వెళ్లారు. ఈ ప్లేస్ గ్రామా నికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రిజర్వాయర్ లోపల పూర్తిగా ఎడిపోవడంతో సోషల్ మీడియా రీల్స్, ఫొటోలకు బాగుంటుందనే ఉద్దేశంతో అందరూ అక్కడికి వెళ్లారు.
దూరంగా నీళ్లు ఉన్న ప్రాంతాాలకు అందరూ బైక్‌లపై వెళ్లి ఫొటోలు తీసుకుంటుండగా.. దీపక్, రామచంద్రరావు ఇద్దరూ అదుపు తప్పి ఆ రిజర్వాయర్‌లో పడిపోయారు. వారిని రక్షించేందుకు మిగతా విద్యార్థులు ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. విషయాన్ని గమనించిన ఓ గేదెల కాపరి స్థానికంగా ఉండే వ్యక్తికి చెప్పగా.. అతను నీటిలో దిగి గాలించినా ఫలితం లేకుండా పోయింది. పెందుర్తి పోలీసులు సిబ్బందితో సహా అక్కడికి వెళ్లి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు.
‘పాపం.. ఆ ఐదుగురు బతికేవాళ్లు’
మృతులు సింహాచలం సమీప పాతగోశాల ప్రాంతానికి చెందిన దీపక్, మర్రిపాలేనికి చెందిన రామచంద్రరావుగా గుర్తించారు. ఇంటర్ చదువుతున్న పిల్లలు చనిపోవడంతో తల్లిదండ్రుల రోదన అందర్నీ కలచివేసింది. వర్షాభావ పరిస్థితుల్లో రిజర్వాయర్ ఎండిపోవడం.. అదే ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు చేస్తుండటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అప్పుడప్పుడు పడిన వర్షాలకు ఆ గుంతల్లో నీరు చేరడంతో యువకులు స్నానాలు, ఫొటోల కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చెబుతున్నారు.