ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో నిజం లేదు
Åఏపీ ఎసఈసీ ప్రకటన
అక్షరకిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. కొంతమంది స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతాయని దుష్ప్రచారం చేస్తున్నారని.. ఎవరో నమ్మొద్దని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రెండు నెలల ఆలస్యం అవుతాయనే ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఎన్నికలకు సంబంధించిన ఏ సమాచారం అయినా మీడియా సమావేశాల ద్వారా అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.. స్థానిక సంస్థల ఎన్నికలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఓటర్ల జాబితాతో పాటుగా రిజర్వేషన్ల అంశాలపై కోర్టుల్లో కొన్ని కేసులు నడుస్తున్నాయని.. అక్కడ క్లియర్ అయ్యాక స్థానిక సంస్థలకు సంబంధించి ప్రక్రియ ప్రారంభిస్తారనే ప్రచారంలోనూ నిజం లేదన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఎన్నికల షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది కాదని స్పష్టత ఇచ్చారు. అధికారిక సమాచారాన్ని నమ్మొ ద్దని, ప్రచారం చేయొద్దని, ఇతరులకు పంపించొద్దని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు, ఇతర వ్యక్తులు ధ్రువీక రణ లేకుండా ఇలాంటి వాటిని పంపించొద్దన్నారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఎవరైనా వాట్సాప్, సోషల్ మీడియా, ఇతర అనధికారిక వేదికల్లో షేర్ చేసే ముందు ధ్రువీకరించుకో వాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే పోలింగ్ బూతులు, ఓటర్ల జాబితాలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ నెల లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
మరోవైపు సర్కు సంబంధించి 44.28 లక్షల నోటీసుల్లో 44.25 లక్షల మంది విచారణ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే 3.71 కోట్ల మంది ఓటర్ల ఫొటోలను బీఎల్వోలు పరిశీలించారు. 3.70 కోట్ల మంది ఓటర్ల ఫొటో క్వాలిటీకి బీఎల్వోలు ఆమోదించారు. బీఎల్వోల దగ్గర 40,927మంది ఫొటో క్వాలిటీ చెక్ పెండింగ్ ఉన్నాయి. రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు, కడప జిల్లాల్లో అధికంగా ఫారం-6 పెండింగ్ కేసులు ఉన్నాయని తెలిపారు.