ప్రపంచం భారత్ సాధించిన విజయాలవైపు చూస్తోంది..
Åఎర్ర కోటపై ప్రధాని మోదీ ప్రసంగం
అక్షర కిరణం, (ఢిల్లీ/జాతీయం): ప్రపంచం భారత్ సాధించిన చారిత్రక విజయాలవైపు చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సంద ర్భంగా ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన ప్రధాని మోదీ అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రగతి కోసం ‘ సప్తధార ’ రోడ్ మ్యాప్‌ను ప్రకటించారు. గత ఐదు నుంచి ఏడు దశాబ్దాల్లో సాధించ లేని దానిని ఈ ఏడు ధారల సాయంతో వచ్చే ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో సాధిస్తామని, దేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తామని ప్రధాని మోదీ వెల్లడించారు.
సప్తధార శక్తి సామర్థ్యాలతో దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తామన్న ప్రధాని.. భారతావనికి నూతన వేగం అందిస్తామని, సరికొత్త లక్ష్యాలను సాధించి, వాటిని అధిగమించేలా శక్తివంతం చేస్తామన్నారు. యువతలో ఉన్న అపార సామర్థ్యాలను దేశ నిర్మాణం కోసం పూర్తిగా వినియోగిస్తామన్నారు. యువత ప్రతిభ, ఉత్సాహం, శక్తిని ఏకం చేసి.. బలమైన, మరింత అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా మళ్లిస్తామని మోదీ ప్రకటించారు. తయారీ రంగం, రైతాంగం, సాంకేతికత, గతి శక్తి, రక్ష శక్తి, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్ పవర్ అనే ఏడు ధారల సాయంతో దేశాన్ని స్వయం సమృద్ధం చేస్తామన్నారు.
పెద్ద స్థాయిలో అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే సామర్థ్యం భారత్‌కు ఉందన్న ప్రధాని మోదీ.. దేశంలో అనేక జాతీయ పార్కులు, మ్యూజిక్ కన్సెర్ట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, ఇతర ఆకర్షణీయ ప్రదేశాలు ఉన్నాయన్నారు. భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ . సరికొత్త తీర్మానాలతో సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోందని.. గతంలో బలహీన దేశంగా ఉన్న భారత్ 12 ఏళ్ల తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. కొత్త ఉత్సాహంతో వికసిత్ భారత్-2047 లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసి ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోని ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో ధ్వనిస్తోందన్నారు ప్రధాని. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురుతోందన్నారు. ఎందరో వీరుల బలిదానాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని. ఎర్రకోట వద్ద తొలిసారిగా వందేమాతరం గీతాన్ని ఆలపించామన్నారు.
సంకల్పం దృఢంగా ఉంటే కఠిన సవాళ్లను సునాయాసంగా ఎదుర్కోవచ్చన్నారు ప్రధాని మోదీ. ‘ఆత్మనిర్భర భారత్ సాధనే మన లక్ష్యం.. ఆత్మ విశ్వాసం పెంచుకోవడంతోపాటు స్వయం సమృద్ధి సాధించాలి. వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ముందుకెళ్తున్నాము. మనం పెద్ద కలలు కనాలి.. దృఢ సంకల్పంతో ముందుకెళ్లాలి. ప్రపంచం భారత్ చారిత్రక విజయాలవైపు చూస్తోంది. నా దేశ యువకులు, మహిళలు, రైతులు, శ్రామికులపై నాకు భరోసా ఉంది.. త్వరలోనే మరికొన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నాము.