బ్రహ్మకుమారీస్ సంస్థ సేవలు అభినందనీయం
ఎంపీ ఎం.శ్రీభరత్ మౌంట్ అబు సమావేశంలో పాల్గొన్న జర్నలిస్టులకు సన్మానం
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): బ్రహ్మకుమారి సంస్థ అందిస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘం అని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ ప్రశంసించారు. డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో బ్రహ్మకుమారీస్ విశాఖపట్నం మీడియా వింగ్ సర్వీస్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన అభినంద న సభలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల యాత్ర విజయ వంతం అయ్యిందన్నారు. బ్రహ్మకుమారీస్ కేంద్రాలు ఆధ్యాత్మి క సౌరభాలు వెదజల్లుతున్నాయని ప్రశంసించారు. నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ మాట్లాడుతూ మీడియా సదస్సు విజయవంతంగా పూర్తి చేసిన పాత్రికేయులను అభినందించారు. మీడియాలో నెగెటివ్ వార్తలు రాసే ముందు సంభందిత అధికారి వివరణ తీసుకోవాలన్నారు. మీడియా సదస్సులో పాల్గొన్న జర్నలిస్టులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. నిర్వాహకులు అతిథులు ఎంపీ, సీపీలను శాలువ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. రాజస్థాన్ లోని మౌంట్ అబూలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ముఖ్య కేంద్రంలో జాతీయ మీడియా సదస్సు జరిగిందని బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతి నిధి రామేశ్వరి తెలిపారు. సెప్టెంబర్ 26 నుండి 30 వరకు జరిగిన ఈ సదస్సులో దేశం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారని తెలిపారు. జర్నలిస్టులు జి.తిరుపతిరావు, సంజయ్ రెడ్డి, జగదీశ్, బ్రహ్మ కుమారీస్ సంస్థ సభ్యులు మధు, మురళీకృష్ణ, సునీత, నారాయణ, వంశీ జయలక్ష్మి, భవాని తదితరులు పాల్గొన్నారు.