ఫామ్`5 అంశంలో ఈసీఈ జ్ఞానేష్‌కుమార్ చుట్టు బిగుసుకుంటున్న ఉచ్చు
అక్షర కిరణం, (ఢిల్లీ/జాతీయం): ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ‘ఫామ్-6’ (ఖీశీతీఎ 6) వివాదంపై భారత ఎన్నికల సంఘం (జ్పుుI) చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SI= ) ప్రక్రియ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ (్పుజ్పుు) జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా ఒక చట్టబద్ధమైన ఫామ్‌ను మార్చారా? లేదా అనేది మాత్రమే ఇక్కడ ప్రశ్న కాదు. సుప్రీంకోర్టు ( Suజూతీవఎవ ్పుశీuతీt ) స్వయంగా గుర్తించిన అధికారాలను ఉపయోగించి, ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ కోసం చేర్చిన అదనపు డిక్లరేషన్‌ను ఈసీఐ తన డిజిటల్ పోర్టల్‌లో ఓటరు నమోదుకు తప్పనిసరి ‘డిజిటల్ గేట్‌వే’గా మార్చిందా? అనేది అంతకంటే ముఖ్యమైన అంశం. ఈ చిన్న వ్యత్యాసమే ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ గమనాన్ని, రాబోయే తీర్పును నిర్ణయించనుంది.
ఫామ్-6 సరే.. ‘జ్పుుIచీవt’ పోర్టల్ సంగతేంటి?
చట్టబద్ధమైన ఫామ్-6లో తాము ఎలాంటి మార్పులు చేయలేదని, ఎసఐఆర్ ప్రక్రియ కోసం కేవలం ఒక అదనపు డిక్లరేషన్‌ను అనుబంధంగా (Aఅఅవఞuతీవ) మాత్రమే జోడించామని ఎన్నికల సంఘం మొదటి నుంచీ వాదిస్తోంది. ఈ విధమైన డాక్యుమెంటేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను తయారుచేసే అధికారం ఈసీకి ఉందని సుప్రీంకోర్టు గత మే నెలలో ఇచ్చిన తీర్పులో పేర్కొన్న విషయాన్ని కమిషన్ గుర్తు చేస్తోంది.
సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది?
1960 ఎన్నికల చట్టం నిబంధనల ప్రకారం రూపొందించిన ఫామ్-6 సాధారణ ఓటర్ల నమోదుకు ఉద్దేశించింది.ఎసఐఆర్ వంటి ప్రత్యేకాంశాల ఆధారంగా జరిగే సవరణల కోసం తగిన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే ‘విశేష అధికారం’ (=వsఱduaశ్రీ Autష్ట్రశీతీఱty) ఎన్నికల సంఘానికి ఉంటుంది. అయితే ఈ అధికారం అపరిమితమైనది కాదు. చట్టబద్ధమైన ప్రక్రియ నుంచి దేనినైనా మళ్లించాలంటే దానికి ఎసఐఆర్ లక్ష్యంతో ‘హేతుబద్ధమైన అనుసంధానం’ (=atఱశీఅaశ్రీ ్పుశీఅఅవctఱశీఅ) ఉండాలి.
తన రక్షణ కోసం మే నెలలో సుప్రీంకోర్టు తీర్పును ఈసీ బలంగా వాడుకునే అవకాశం ఉంది. కానీ, ఈ వివాదానికి మరో కోణం ఉంది. అది భౌతిక రూపంలో ఉండే ఫామ్-6 గురించి మాత్రమే కాదు.. ఈసీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన జ్పుుIచీవtలో దానిని అమలు చేసిన విధానం గురించి!
ఈసీకి చుట్టుముడుతున్న ‘డిజిటల్ గేట్‌వే’ సమస్య
కాగితం మీద ఫామ్-6, అదనపు డిక్లరేషన్ల మధ్య వ్యత్యాసం చట్టబద్ధంగా సరిగ్గానే కనిపించవచ్చు. కానీ, ఎన్నికల సంఘం డిజిటల్ పోర్టల్‌లో అదనపు డిక్లరేషన్‌ను నింపకుండా ఓటరు ఫామ్-6 అప్లికేషన్‌ను ముందుకు తీసుకెళ్లలేని విధంగా మార్పులు చేసి ఉంటే, ఆ వ్యత్యాసం అర్థరహితంగా మారుతుంది. ఒకవేళ డిక్లరేషన్ అనేది కేవలం ఒక అనుబంధ పత్రం మాత్రమే అయితే ఈసీ వాదన నిలుస్తుంది. కానీ, సాఫ్ట్వేర్ కోడింగ్ ద్వారా ఆ డిక్లరేషన్‌ను పూర్తిచేస్తేనే ఫామ్-6 నింపడానికి అవకాశం ఇచ్చేలా రూపొందిస్తే మాత్రం.. చట్టబద్ధమైన ఫామ్‌కు ఈసీ సొంతంగా ఒక అదనపు కఠినమైన షరతును విధించినట్లే అవుతుంది.
దీంతో సుప్రీంకోర్టు విచారణ ‘ఫామ్-6ను ఎవరు మార్చారు?’ అనే ప్రశ్న నుంచి ‘డిజిటల్ సిస్టమ్ ద్వారా అదనపు డిక్లరేషన్‌ను ఫామ్-6కు ఎవరు తప్పనిసరి చేశారు?’ అనే వైపు మళ్లే అవకాశం ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఈసీకి అంత సులభం కాకపోవచ్చు.
ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలు ఎసఐఆర్‌కు సంబంధించిన నిర్ణయాలపై గత 10 నెలల్లో కనీసం 14 సార్లు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారని కొన్ని నివేదికలు వెల్లడించాయి. దీంతో ఈ అంశం ఒక్క సీఈసీ వ్యక్తిగత నిర్ణయమా? లేక రాజ్యాంగబద్ధమైన ముగ్గురు సభ్యుల కమిషన్ తీసుకున్న నిర్ణయమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (్పుజీI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అక్టోబరు 5 నాటి విచారణలో కమిషన్ ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకోవాలని, ఏకాభిప్రాయం కుదరనప్పుడు మెజారిటీ ఆధారంగా నిర్ణయం ఉండాలని స్పష్టం చేశారు. సరైన ప్రక్రియను అనుసరించకుండా నిర్ణయం తీసుకున్న ట్లు రికార్డుల్లో తేలితే, ఆ నిర్ణయాన్ని ‘అధికార పరిధి దాటింది’(Uశ్రీtతీa Vఱతీవs) గా ప్రకటిస్తూ రద్దు చేస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
సీఈసీ ఒక్కరే ఈ నిర్ణయం తీసుకున్నారని రికార్డుల్లో తేలితే, అది ఆయన వ్యక్తిగత బాధ్యతగా మారుతుంది. ముగ్గురు సభ్యుల కమిషన్ దీనికి ఆమోదం తెలిపినట్లు ఉంటే, సంస్థాగతంగా ఈసీఐ బాధ్యత వహించాల్సి ఉంటుంది. విధానపరంగా డిక్లరేషన్ చట్టబద్ధమే అయినప్పటికీ, డిజిటల్ అమల్లో అనధికారికంగా దానిని తప్పనిసరి చేశారని తేలితే.. అది పాలసీ లోపం కాకుండా సాంకేతిక అమలు లోపంగా మారుతుంది. ప్రస్తుతానికి ఈసీకి ఉన్న అతిపెద్ద చట్టపరమైన రక్షణ గత మే నెలలోని సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే. కానీ, ఈసీ అమల్లోకి తెచ్చిన మార్పులు ఆ తీర్పు పరిమితులకు లోబడి ఉన్నాయా లేదా అనేదే ప్రధానాంశం. సుప్రీంకోర్టు ఇంకా ఈసీని దోషిగా తేల్చలేదు. కేవలం రికార్డులను మాత్రమే సేకరించాలని ఆదేశించింది. కాబట్టి ఇప్పుడు తేలాల్సిన అసలు విషయం ఫామ్-6ను ఎవరు మార్చారనేది మాత్రమే కాదు.. ఆ మార్పును డిజిటల్‌గా ఎవరు అమల్లోకి తెచ్చారు? దానికి మే నాటి సుప్రీం తీర్పు అనుమతించిందా లేదా? అనేదే!