స్వాతంత్య్రానికి, ఆత్మగౌరవానికి ప్రతీక జాతీయ జెండా
Åస్వాతంత్య్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు
అక్షర కిరణం, (అమరావతి): స్వాతంత్య్రానికి జాతీయ జెండా ప్రతీక.. ఆత్మగౌరవానికి ప్రతిబింబమన్నారు చంద్రబాబు. జాతీయ జెండా ఐక్యతకు చిహ్నం.. భవిష్యత్‌కు మార్గదర్శకమని వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్య్రం ఒక్క రోజులో, ఒకరి పోరాటంతో రాలేదన్నారు. ఎన్నో దశాబ్దాల పోరాటం.. ఎన్నో తరాల ఉద్యమంతో వచ్చింద న్నారు ముఖ్యమంత్రి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూడి పరేడ్ గ్రౌండ్స్‌లో తొలిసారిగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయజెండాను ఎగుర వేశారు. అనంతరం ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఎంతోమంది మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితం గా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు చంద్రబాబు. దేశ, రాష్ట్ర భవిష్యత్తును గొప్పగా నిర్మించడమే మహానీయుల త్యాగాలకు నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరి చేతిలో జాతీయ జెండా ఉండాలి.. గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలన్నారు. స్వాతంత్య్ర సమరంలో తెలుగు నేలకు ముఖ్య పాత్రం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ దేశం మనకు హక్కులు, గుర్తింపు, గౌరవం ఇచ్చిందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.
ప్రతి పౌరుడు ‘నా దేశం, నా బాధ్యత’ అని ముందుకు సాగాలన్నారు ముఖ్యమంత్రి. ‘దేశం నాకు ఏం చేసిందని కాదు.. దేశానికి నేను ఏం చేయగలను’ అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. ప్రతిఒక్కరూ 2047 నాటికి విక సిత్ భారత్-స్వర్ణాంధ్ర సాకారం చేయాలన్న లక్ష్యంలో భాగ స్వామ్యం అవ్వాలన్నారు. 100 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడు కలు చేసుకోనే నాటికి దేశం, రాష్ట్రం వికాసం నుంచి వైభవం వైపు ముందుకుసాగాలని ఆకాంక్షించారు. స్వర్ణాంధ్ర సంకల్పంతో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ వన్‌గా నిలి పేందుకు అందరం కలిసి ఐక్యంగా ముందుకు సాగాల న్నారు.. వచ్చే 20 ఏళ్లు కష్టపడి పనిచేయాలన్నారు.
కూటమి ప్రభుత్వ పాలనలో విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగు వేస్తున్నామన్నారు. ఏపీకి కేంద్రం సహకారంతో కొత్త ఊపిరి వచ్చిందని.. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా 10 సూత్రాలతో పాలన చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామం, ప్రతి జిల్లా అభివృద్ధి చెందేలా ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో.. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లుగా అభివృద్ధి చేస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయజెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి ప్రసంగించారు. భారత్ బలంగా, సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తుందన్నారు పవన్. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ కూడా తనదైన పాత్ర పోషిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు పవన్ కళ్యాణ్.