మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ధ్యేయం
Åఎమ్మెల్యే కూన రవికుమార్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్
అక్షర కిరణం, (పొందూరు): కూటమి ప్రభుత్వంలో మహిళలే మహారాణులని, వారిని కేవలం స్వయం సహా యక సంఘాల సభ్యులుగానే కాకుండా పారిశ్రామికవేత్త లుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆమదాల వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. పొందూరులోని సాయిబాబా వీవర్స్ సొసైటీ నూతన భవనంలో డీఆర్డీఏ-సెర్ప్ ఆధ్వర్యంలో ఖాదీ క్లస్టర్ ఏర్పాటులో భాగంగా మహిళ లకు 20 మగ్గాలపై నిర్వహిం చనున్న ఉచిత చేనేత శిక్షణ ను బుధవారం వారు సంయుక్తంగా ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మహిళలకు నైపుణ్య శిక్షణ అందించ డంతో స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆధు నిక పద్ధతుల్లో నాణ్యమైన చీరల తయారీపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పొందూరు చేనేత సంప్రదాయాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధా నించి మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన డ్వాక్రా వ్యవస్థ వల్ల నేడు మహిళా సంఘాలకు బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు లభిస్తున్నాయ న్నారు. ఈఅవకాశాలను మహిళలు సద్వినియోగం చేసు కుని కుటుంబాలకు ఆసరాగా నిలవాలని కూన రవి కుమార్, స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. శిక్షణ పొందిన మహిళలకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మార్కెటింగ్ అవకాశాలను సైతం సమకూరుస్తామని తెలి పారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్ సహా స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, చేనేత రంగ ప్రతి నిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.