సమర యోధుల త్యాగ ఫలమే మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం
స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్
అక్షర కిరణం, (విశాఖపట్నం): స్వాతంత్య్ర సమర యోధుల ప్రాణ త్యాగాలు, పోరాటాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. భారత దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలోని పోలీస్ గ్రౌండ్లో రాష్ట్ర మంత్రి భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అభిజిత్ కిషోర్, పోలీస్ క£మిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీతోపాటు పోలీస్ బృందం, ప్రముఖులు పాల్గొన్నారు.