దేశంలోనే ట్రాఫిక్ లైట్లు లేని తొలి నగరం
అక్షర కిరణం, (రాజస్థాన్/ జాతీయం): దేశంలోని కీలక నగరాలైన ఢల్లీి, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా సహా చాలా నగరాలు.. ట్రాఫిక్ ఊబిలో చిక్కుకున్నాయి. ఇలాంటి నగరాల్లో నివసించే ప్రజలు నిత్యం.. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక దేశంలోని పలు నగరాల్లో నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యలను నెటిజన్లు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. మరోవైపు.. దేశంలోనే బెంగళూరు పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కిలోమీటర్ దూరం ప్రయాణించాలన్నా.. గంటల తరబడి ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఈ క్రమంలోనే.. రాజస్థాన్‌లోని కోట నగరం.. భారతదేశం లోని పట్టణ ట్రాఫిక్ నిర్వహణకు ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. దేశంలోనే ట్రాఫిక్ లైట్లు లేని మొట్టమొదటి నగరంగా కోట రికార్డుల్లోకి ఎక్కింది.
కోచింగ్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరు గాంచిన కోట నగరంలో దేశవ్యాప్తం గా లక్షలాది మంది విద్యార్థులు.. రకరకాల పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ కోటలో వివిధ కోచింగ్‌లు తీసుకోవడం వల్ల ఆ నగరానికి కోచింగ్ హబ్‌గా పేరు వచ్చింది. ఇక స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల వారు ఉన్నప్పటికీ.. కోట మాత్రం ఒక ప్రత్యేకతను సృష్టించింది. భారతదేశంలో మొట్టమొదటి ట్రాఫిక్ లైట్ ఫ్రీ సిటీగా అవతరించింది. కోట నగరంలో ఒక్కటంటే ఒక్కటి కూడా ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా నిరంతరాయంగా వాహనాలు పరుగులు తీస్తుండటం విశేషం.
కోటలోని అర్బన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ అమలు చేసిన స్మార్ట్ అర్బన్ డిజైన్ కారణం గానే ఈ ట్రాఫిక్ లేని నగరం సాధ్యమైందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కోట నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించి.. పూర్తిగా ట్రాఫిక్ లైట్లను నగరంలో నుంచి తొలగించడానికి.. అక్కడ కీలకమైన మౌలిక సదుపాయాలను అర్బన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ అభివృద్ధి చేసింది. కోట నగరంలోని కీలక జంక్షన్ల వద్ద రెండు డజన్లకు పైగా ఫ్లైఓవర్లను నిర్మించింది. ఇవే కాకుండా అండర్‌పాస్‌లను ఏర్పాటు చేశారు. దీనివల్ల ట్రాఫిక్ ఎక్కడా ఆగిపోకుండా.. వాహనాలు నిరంతరం కదిలేలా చూసుకున్నారు.
మరోవైపు.. నగరంలో రద్దీగా ఉండే రూట్లలోకి వాహనాలు వెళ్లకుండే ఉండేందు కు వీలుగా.. ఇంటర్కనెక్ట్డె రింగ్ రోడ్లను నిర్మించారు. ఈ రింగ్ రోడ్ల కారణంగా ట్రాఫిక్ రద్దీని సమర్థవంతంగా తగ్గించడా నికి ఉపయోగపడిరది. ఈ వినూత్న ట్రాఫిక్ వ్యవస్థతో లక్షలాది మంది నగరవాసులు, నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది విద్యార్థులకు ఎలాంటి ఆలస్యం లేకుండా.. అనుకున్న సమయానికి గమ్యస్థానాలు చేరేలా భరోసా వచ్చేసింది.