కూటమి ప్రభుత్వం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మారింది
కమజ్జి శ్రీనివాస రావు
అక్షర కిరణం, (విజయనగరం): విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిం చారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా తయారయిందని ప్రతి ప్రభుత్వ సంస్థను ప్రైవేటీకరణ చేసే విధంగా అడుగులు వేస్తుందని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో విజయనగరం జిల్లాకు మంత్రి, ఎమ్మెల్యే అందరూ కలిసి ఎంతవరకు లబ్ది చేకూరుేస్తారో చూస్తామన్నారు. ఈ జిల్లాకు నిధులన్నీ వచ్చే విధంగా పోరాటం చేయాలని సూచించారు... జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి వేసవిలో మంచినీటి కొరత రాకుండా చూడాలని కోరారు. శాసనమండలి ప్రతిపక్ష నాయకులైన బొత్స సత్యనారాయణ నాయకత్వంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల తరఫున పోరాడుతామని.. ప్రజలకు రావాల్సిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు, నాయుడు బాబు, జడ్పిటిసి నరసింహమూర్తి పాల్గొన్నారు.