భారత్ ఇరాన్ స్నేహబంధం 5వేల ఏళ్ల పురాతనమైనది
¿అమెరికా ప్రారంభించిన అనైతిక యుద్ధంలో ఇరాన్ నైతికతే జయిస్తుంది¿గాంధీజీ త్యాగశీలతే మా సుప్రీం లీడర్‌కు ఆదర్శం ¿ఇరాన్లో పలు యూనివర్శిటీలు, రహదారులకు గాంధీజీ పేరు పెట్టాం
¿నేటికి జనవరి 30న ఇరాన్లో గాంధీజీకి నివాళులర్పిస్తుంటాం ¿భారత మద్దతుకు ధన్యవాదాలు
¿విశాఖ అక్కయ్యపాలెంలో నిర్వహించిన జల్సా ఏ యాద్ ఏ షోహదా కార్యక్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ దౌత్యవేత్త ఆయతుల్లా డాక్టర్ అబ్దుల్ హకీమ్ ఇలాహీ
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఇరాన్ భారత దేశాల మధ్య ఉన్న స్నేహ బంధం 5వ వేల ఏళ్లకు పైగా పురాతనమైనదదని, అమెరికా ఇరాన్‌పై రుద్దిన ఈ యుద్ధం పూర్తిగా అనైతికమైనదని ఇరాన్ దేశ సుప్రీం లీడర్ భారత దౌత్యవేత్త ఆయతుల్లా డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి అన్నారు. విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం, అబీద్‌నగర్‌లో ఉన్న ఇదారా ఏ ఇమామ్ రెజా సమావేశ మందిరంలో షియా ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిర్వహించిన జల్సా ఏ యాద్ ఏ షోహదా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా అమెరికా చేసిన దాడిలో అమరులైన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమెనాయికి, ఆయనతోపాటు అమరులైన నాయకులకు, అదేవిధంగా అమెరికా ఇరాన్‌లోని పాఠశాలపై చేసిన దాడిలో అమరులైన 130 మంది ఇరానీ బాలలకు నివాళులర్పించారు. ఈసందర్భంగా దౌత్యవేత్త ఆయతుల్లా డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి మాట్లాడుతూ భారత్, ఇరాన్ సంబంధాలు కొన్ని వేల సంవత్సరాల నాటివని గుర్తు చేశారు. తమ దివంగత సుప్రీం లీడర్ భారత జాతిపిత మహాత్మా గాంధీ గొప్పతనాన్ని తరచు ఇరాన్దేశవాసులకు తెలియజేస్తుంటా రని తెలిపారు. ఇరాన్లో ఎన్నో ఆస్పత్రులు, రహదారులకు, పాఠశాల లకు మహత్మా గాంధీజీ పేరు పెట్టినట్టు ఆయన తెలియజేశారు. నేటికి ప్రతి ఏటా జనవరి 30వ తేదీన గాంధీజీ సంస్మరణ దినాన్ని ఇరాన్ దేశంలో నిర్వహించి గాంధీజీ చేసిన త్యాగాన్ని, సేవలను గుర్తు చేసుకుంటు ఉంటామన్నారు. తమ సుప్రీం లీడర్ నిరాడంబర జీవన విధానానికి గాంధీజీయే ఆదర్శమన్నారు. తమ దివంగీsత సుప్రీం లీడర్ ఖమెనాయి ఎంత పెద్ద ీVAదా ఉన్నప్పటికి సొంత ఇల్లు కూడా లేకుండా అద్దే ఇంటిలోని జీవించేవారని ఆయన నలుగురు కుమారులు సైతం అదేనిరాడంబర జీవన విధాన్ని కొనసాగిస్తూ అద్దె ఇళ్లలోనే జీవిస్తున్నారన్నారు. అఎîTరికా ఇరాన్ దేశపు సహజ వనరులను తన గుప్పిట్లో పెట్టుకోవడం కోసమే ఈ అనైతిక యుద్ధాన్ని ప్రారంభించిం దన్నారు. తమ దేశ ప్రజలు ఎన్నడూ ఇటువంటి అనైతికతను, సామ్రాజ్యవాదాన్ని, నియంతత్వాన్ని అంగీకరించరని స్పష్టం చేశారు. ఇరాన్ సహజ వనరులు కేవలం ఇరాన్ దేశ ప్రజలకు మాత్రమే చెందుతాయని వాటిని అమెరికా కాళ్ల ముందు తాకట్టు పెట్టమని స్పష్టం చేశారు. అమెరికా ప్రారంభించిన ఈ అనైతిక యుద్ధంలో అమెరికా ఇజ్రాయిల్‌లు తరచూ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయని తెలిపారు. ఆస్పత్రులు, పౌర నివాసాలు, యునివర్సిటీలు, మౌలిక సదుపాయాలపై బాంబులు వేస్తూ సామాన్య ప్రజలను హత్య చేస్తున్నాయని పేర్కొన్నారు. తమ దివంగత సుప్రీం లీడర్ రక్షణ కోసం ప్రత్యేక బంకర్ ఏర్పాటు చేస్తామన్నా ఆయన అందుకు అంగీకరించలేదని ముందు దేశ ప్రజలందరికి రక్షణ కల్పించాలని అందుకు తన ప్రాణాలు పోయినా చింతించనని చెప్పి అదేవిధంగా తన చిన్న ఇంటిలోనే చివరి వరకు నివసించిన ధీశాలి అని సుప్రీం లీడర్‌ను తలచుకుని క£న్నీటిపర్యాంతమయ్యారు.
కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్న అమెరికా
ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించిన అమెరికా తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆయతుల్లా అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి తెలిపారు. అంతేకాకుండా ఒక వైపు సంధిప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు అమెరికా వెన్నుపోటు పొడుస్తూ తమ దేశ సామాన్య పౌరులను కిడ్నాప్ చేస్తోందని తెలిపారు. స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్‌లో పరిస్థితి అంతా తమ కంట్రోల్లోనే ఉందని ఆయన చెప్పారు. అమెరికా ఎన్ని కుట్రలు పన్నినా అంతిమ విజయం మాత్రం ఇరాన్ దేశ నైైతికతకే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ముందు మొకరిల్లడం అంటే ఇరాన్ ఆత్మగౌరవం, సార్వభౌమత్వాన్ని తాకట్టుపెడ్డడమేనని దానికి వేల ఏళ్ల సంవత్సరాల నాగరికత గల ఇరాన్గాని, తమ దేశ పౌరులగాని ఎన్నటికి అంగీకరించరని కుండబద్దలుకొట్టారు.
భారత పౌరల భద్రతకు చర్యలు
తమ దేశంలో ఉన్న భారత పౌరులు, ముఖ్యంగా విద్యార్థులు, పర్యాటకుల రక్షణకు, వారి భద్రతకు ఇరాన్ అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. ముఖ్యంగా ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ విషయంలో తమకు ఎంతో సహకరిస్తోందని చెప్పారు. కొందరు భారత టూరిస్టులు, విద్యార్థుల వీసా గడువు ముగిసినప్పటికి వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వీసా గడువు పెంచేలా భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుని కషి చేస్తున్నామని తెలిపారు.
భారత్ మద్దతుకు ధన్యవాదాలు
అమెరికా తమపై ప్రారంభించిన ఈ అనైతిక యుద్ధంలో భారత ప్రజలు ఇరాన్‌కు ఇస్తున్న నైతిక మద్దతుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేవలం ముస్లింలేకాకుండా భారత్ నుంచి హిందూ, క్రైస్తవ, సిక్కు జైన సోదరులు అందరు తమకు నైతికంగా మద్దతు పలుకుతుండడంపై కతజ్ఞతలు తెలియజేశారు. భారత్‌లో పెద్ద సంఖ్యలో హిందుసోదరులు తమకు సంఘీభావం తెలుపు తుండడం ఈ దేశంతో తమకున్న పురాతన స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని కొనియాడారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టం
అమెరికా ప్రారంభించిన ఈ యుద్ధం కేవలం ఇరాన్‌కే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం తీవ్ర నష్టాన్ని కలుగచేస్తోందని తెలియజేశారు. అమెరికా అనైతిక యుద్ధాన్ని దాని మిత్రదేశాలే కాకుండా స్వయంగా అమెరికా పౌరులే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ర్యాలీసలు చేయడం దీనికి నిదర్శనమని ఇరాన్ దౌత్యవేత్త ఆయతుల్లా డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షియా ముస్లిం నేతలు మౌలానా అబ్బాస్ బాఖరీ, మౌలానా ఆబిద్ అలీ, మౌలానా ఇనాం హైదర్, మైనార్టీ నాయకులు ఎండీ నజీర్, సీరత్ కమిటీ సభ్యులు మునీర్ ఖాన్, బోహ్ర కమ్యునిటీ సభ్యులు ముస్తాఫా, అధిక సంఖ్యలో షియా ముస్లింలు, మహిళలు పాల్గొన్నారు.