అక్షర కిరణం, (విశాఖపట్నం): జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యుడు, సీనియర్ నాయకులు బెహరా భాస్కరరావు తన భార్య, కోడలు తో జనసేన పార్టీలోకి జంపు అవ్వడంతో ఆయనపై విభిన్న అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. వైసీపీలో ఉన్నప్పుడు జనసేన ఒక పార్టీ కాదని, పవన్ కళ్యాణ్ పెద్ద జోకర్ అని అనేక సందర్భాల్లో నూరు పారేసుకున్న బెహరా.. అదే తరుణంలో సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని విమర్శలు చేసిన బెహరా భాస్కరరావు పార్టీలోనికి సిగ్గు లేకుండా ఎలా వచ్చి కండువా కప్పుకుంటారని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. జనసేనలోని కొంతమంది నాయకులు వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉందని వారు అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చిన ప్పుడు వైసీపీ నాయకులు అడుగడుగునా నిర్బంధించ డంలో బెహరా భాస్కరరావు తన కార్యకర్తలతో కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలను వారు గుర్తు చేస్తున్నా రు. 2013 నుంచి జెండా మోసిన పవన్ అభిమా నులు, కార్యకర్తలు అలాగే ఉండిపోయారని, వారికి ఎలాంటి గుర్తింపు రావడంలేదని, వలస వచ్చిన నాయ కులు మాత్రం పార్టీలో అందలం ఎక్కుతూ పార్టీలో చక్రం తిప్పడం ఆవేదన కలిగిస్తుందని వారు అభిప్రాయ పడుతున్నారు. వైసీపీ నేతలు మాత్రం బెహరా భాస్కర రావు పార్టీ ఫిరాయింపుపై విమర్శల వర్షం కురిపిస్తు న్నారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని బెహరా భాస్కరరావు అనేక వ్యాపారాలు, భూకబ్జాలకు పాల్పడ్డారని, లోకేష్ యువగళం పేరుతో విశాఖ వచ్చినప్పుడు బెహరా అన్యా యాలపై ఆరా తీశారని, ఆయన అవినీతి చిట్టా, పోలీస్ కేసుల లిస్టు వివరాలు లోకేష్ రెడ్‌బుక్‌లో ఉన్నాయని అంటున్నారు. అందుకే ఆయన అదును చూసుకొని కూటమి ప్రభుత్వానికి అవసరమైన వేళ పార్టీ ఫిరాయిం చారని అంటున్నారు. అక్కడ కూడా బెహరా భాస్కరరావు ఉండలేరని చెప్తున్నారు. వైసీపీలో ఉన్న ఆయన ఎప్పుడు స్థానిక ఎమ్మెల్యేకే లోపాయికారిగా మద్దతు ఇస్తూ సహకరిస్తారనే వాదనలు ఉన్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినప్పుడు వార్డ్ ప్రజలు కార్యకర్తలతో ఓట్లు వేయించిన సంగతి అందరికీ తెలిసిందేనని వారు విమర్శిస్తున్నారు.
కూటమి ప్రభుత్వానికి గతి లేదు :
గతంలో బెహరా భాస్కరరావు జనసేన లోకి చేరడానికి సిద్ధపడితే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వద్దన్న సంగతి తెలిసిందే. కొంతమంది కార్పొరేటర్లు మాత్రం జనసేనలో చేరిన, బెహరాకు మాత్రం బ్రేక్‌లూ పడ్డాయి. ఇప్పుడు మేయర్ పదవి దక్కించుకోవడానికి కోరం సంఖ్య తక్కువ ఉండడం, బెహరా చేతిలో ఇద్దరు కార్పొరేటర్లు ఉండడంతో ఇష్టం లేకపోయినా, మద్దతు కోసం ఊ కొట్టే పరిస్థితి ఏర్పడిరది. ఇదే అదునుగా భావించిన బెహరా భాస్కరరావు డిప్యూటీ మేయర్ ఇస్తానంటేనే జండా మారుస్తానని కండిషన్ కూడా పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే కూటమి ప్రభుత్వానికి దిక్కులేదు..! బెహరాకు గతి లేదు అంటూ బెహరా పార్టీ ఫిరాయింపుపై జనాలు జోకులు వేసుకుంటున్నారు.
బెహరాకు ఉన్న బలం ఏంటి..?
బెహరా భాస్కరరావు రాజకీయ జీవితంలో ఎదగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు కార్యకర్తలు. స్థానికంగా కుల బలం ఏ మాత్రం లేదు. రాజకీయంగా రాజకీయం చేస్తూ ఎదిగిన ఫ్యామిలీ కూడా కాదు. ఏదో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన కరిష్మా తో ఈయన కార్పొరేటర్ అవ్వగలిగారు. తదుపరి రాజకీయ జీవితమంతా కుట్ర.. కుతంత్ర రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. తాను తన కుటుంబ సభ్యులు రాజకీయంగా ఎదగడానికి పార్టీలతో పని లేకుండా ప్రతిపక్షాలతో అవసరం మేరకు కుమ్మక్క కావడంలో ఇతనికి మించిన రాజకీయ ఉద్దండుడు ఇంకెవరూ ఉండరని విమర్శలు ఉన్నాయి. ఓట్లు పొందేందుకు కుమ్మరించగల ధన బలం.. ప్రతిపక్షాలతో కుమ్మక్కయ్యే రాజకీయ చతురత ఉన్నంత కాలం ఇటువంటి నాయకులకు డోకా ఉండదని పలువురు నిజాయితీ కార్యకర్తలు మాట్లాడకుండడం విశేషం. మరి మేయర్ పీఠం దక్కించుకున్న తర్వాత కూటమి ప్రభుత్వంలో బెహరా భాస్కరరావు సీన్ ఏంటి..? భవిష్యత్తు ఏంటి అనేది తేలాల్సి ఉందని వైకాపా కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.
(త్వరలో మరిన్ని కథనాలు వచ్చే సంచికలో)