పేదల కడుపు నింపడమే అన్న క్యాంటీన్ల లక్ష్యం
కఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
అక్షర కిరణం, (మధురవాడ):
అన్నార్తుల ఆకలి తీర్చడమే ముఖ్యమంత్రి చంద్రన్న ధ్యేయంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారని, కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని భీమిలి నియోజక వర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ జోన్-2 పరిధి 5వ వార్డులో మారికవలస కూడలిలో అన్నా క్యాంటీన్‌ను కార్పొరేటర్ మొల్లి హేమ లతతో కలసి సంయుక్తంగా ప్రారంభించారు. ఈసందర్భంగా గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలకు కడుపునిండా భోజనం పెట్టే ఈగొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంద న్నారు. సీఎం చంద్రబాబు మానస పుత్రిక అన్న క్యాంటీిన్ అన్నారు. ఈ కార్య క్రమానికి సహకరించాలని కోరారు. సేవాభావంతో ముందుకు వచ్చి అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చి.. పేదల కడుపు నింపడంలో మీ వంతు పాత్ర పోషించాలని గంటా పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా అన్న క్యాంటీన్ల ను ఏర్పాటు చేసిందని చెప్పారు. పేద వాడి కడుపునింపేందుకు భవనాలు నిర్మించి పరిశుభ్రమైన వాతావరణం లో, నాణ్యమైన భోజనాన్ని రూ.5కే అందించామని చెప్పారు. కార్యక్రమంలో భీమిలి నియోజక వర్గ జనసేన టీడీపీ ఇన్చార్జిలు కోరాడ రాజబాబు, సందీప్ పంచకర్ల, స్థానిక టీడీపీ నాయకులు మొల్లి లక్ష్మణరావు, వాండ్రాశి అప్పలరాజు, బోయ శ్రీను, రమాదేవి, నాగోతి వెంకట సత్యనారాయణ, జనసేన అధ్యక్షులు దేవర శివ, పొట్టి ప్రసాద్, గల రవి, కొండపు రాజు, ఇయ్యపు నాయుడు, ఈగల అప్పలనాయుడు, ఆనందరావు, కామరాజు, ముచి రామనాయుడు, బొడ్డేపల్లి రంగా, చక్రి, ఎం.నాగేశ్వరరావు తది తరులు పాల్గొన్నారు.