ఆ అధికారి వద్దంటూ టీడీపీ శ్రేణుల ధర్నా
వివాదానికి దారి తీసిన ధర్మవరం మున్సిపల్ కమిషనర్ నియామకం
మంత్రి కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తల నిరసన
అక్షర కిరణం, (ధర్మవరం/అనంతపురం జిల్లా): ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఓ అధికారి నియామకం కూటమిలో వివాదం రేపింది. టీడీపీ కార్యకర్తలు ఏకంగా మంత్రి కార్యాలయం దగ్గర ధర్నాకు దిగడం చర్చనీయాంశ మైంది.. ఆ తర్వాత పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. మంత్రి సత్యకుమార్ ధర్మవరంలోని కార్యాలయంలో పుర పాలక అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. కమి షనర్ మల్లికార్జున కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈవిషయం తెలియడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి వెళ్లి నిరసన చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాం లో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డికి అనుకూలంగా పనిచేసిన పురపాలక కమిషనర్ మల్లికార్జునను మళ్లీ ధర్మవరానికి ఎలా తీసుకువస్తారని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ కార్యాలయం ఎదుట టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. వెంటనే కమిషనర్‌ను బయటకు పంపాలంటూ ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. టీడీపీ కార్యకర్తలు కార్యాలయం వైపు దూసు కెళ్లగా పోలీసులు సర్దిచెప్పి అడ్డుకున్నారు. ఆ తర్వాత కమిష నర్ మల్లికార్జునను మంత్రి కార్యాలయం నుంచి పోలీసు వాహనంలో తరలించారు. కొద్దిసేపటికి మంత్రి సత్య కుమార్ బయటకు రాగా.. టీడీపీ కార్యకర్తలు చుట్టు ముట్టా రు. పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తల్ని పక్కకు పంపగా.. మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. టీడీపీ కార్యకర్తలు ధర్నా వ్యవహారం ధర్మవరంలో హాట్ టాపిక్ అయ్యింది. కూటమిలో విభేదాలు మొదలయ్యాయని చర్చ జరిగింది.. దీంతో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, జనసేన పర్టా నేత చిలకం మధుసూదన్ రెడ్డి, బీజేపీ నేత సందిరెడ్డి శ్రీనివాసులు ఈ అంశంపై స్పందించారు. ధర్మవరం కూటమిలో ఎలాంటి విభేదాలులేవని, నియోజకవర్గ అభివృద్ది మాత్రమే లక్ష్యం అన్నారు నేతలు. కూటమిలో మూడు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. కమిషనర్ నియామకంపై తమకు అభ్యంతరాలు మాత్రం ఉన్నాయని చెప్పారు. గతంలో ఆయన ధర్మవరంలో కమిషనర్‌గా పనిచేసిన సమయంలో.. వైసీపీకి అనుకూలంగా పనిచేశారన్నారు. ఇదే అంశాన్ని మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తనకు ఇవన్నీ తెలియవని.. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు. తొలి ఆరునెలల కాలంలో చిన్నచిన్న సంఘటనలు ఉంటాయని.. అధికారులు, నాయకులంతా సమన్వయం చేసుకోవడానికి సమయం పడుతుంది అన్నారు.