ఆదర్శనీయం శ్రీనివాస్ పొన్నగంటి ప్రస్థానం
Åఉద్యోగ విరమణ సభలో వక్తల అభినందన
అక్షర కిరణం, (విశాఖపట్నం): దూరదృష్టి, నిజాయితీ, స్థైర్యం, శ్రేష్ఠతపై నిబద్ధతతో కూడిన ప్రస్థానం సాగించిన శ్రీనివాస్ పొన్నగంటికి అభినందలు తెలుపుతూ కనెక్ట్ మాగజైన్లో ప్రత్యేక వ్యాసం ప్రచురించారు. పొన్నగంటి శ్రీనివాస్ స్వస్థలం అనకాపల్లి జిల్లా, మాకవర పాలెం మండలంలోని తామరం. ఈయన మొదటి నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలంలోనే చదువుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారు కూడా ఉన్నత స్థానాలకు ఎదగవచ్చు అనేదానికి శ్రీనివాస్ నిదర్శనంగా నిలిచారు. ఈయన ఆంధ్రాయూనివర్సిటీలో ఎంటెక్ వరకు చదువు కొని మద్రాస్ T్పుSలో 1990లో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. తరువాత 12 ఏళ్లు విదేశాలలో ఉద్యోగం చేసి, అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆ తరువాత కోవేలెన్స్ డిజిటల్ సంస్థలో ్పుOO గా బాధ్యతలు చేపట్టారు.
దశాబ్దాల అంకితభావంతో కూడిన సేవతో, ఆయన సంస్థ అభివృద్ధికి దోహదపడటమే కాకుండా, వినయం, వివేకం, నాయకత్వంతో ఎందరికో స్ఫూర్తినిచ్చారు.
ఉద్యోగ విరమణ తర్వాత కూడా తన ప్రభావాన్ని కొనసాగించే ఒక నాయకుడి అద్భుతమైన ప్రస్థానానికి ఇది సంస్థ ఇచ్చే గౌరవంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ IT రంగంలో అత్యున్నత స్థాయి లో సేవందించ áడమే కాకుండా, ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని అభినం దించారు. దూరదృష్టి, అంకితభావం, వివేకం, మార్గదర్శ కత్వంతో సహోద్యోగులకు స్ఫూర్తినిచ్చారని ఆయన నిబద్ధత చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను బంధువులు, మిత్రులు సహోద్యోగులు అభినందించారు.