డ్‌క్రాస్ సేవల్లో శ్రీకాకుళం జిల్లాకు గవర్నర్ గోల్డ్‌మెడల్ ప్రదానం
అక్షర కిరణం, (శ్రీకాకుళం/అమరావతి): ఇండి యన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన మానవతా సేవా కార్యక్రమాల్లో శ్రీకాకుళం జిల్లా అత్యుత్తమ ప్రతిభ కన బరిచి రాష్ట్ర స్థాయి అవార్డును కైవసం చేసుకుంది. 2024 -25 సంవత్సరానికి సేవల్లో ఉత్తమ ఫలితాలు సాధించినం దుకు శ్రీకాకుళం జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. విజ యవాడలో నిర్వహించిన రెడ్‌క్రాస్ రాష్ట్ర శాఖ వార్షిక సాధారణ సమావేశంలో రాష్ట్ర గవర్నర్, ఐఆర్సీఎస్ ప్రెసిడెంట్ అబ్దుల్ నజీర్ నుంచి కలెక్టర్, రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ‘గవర్నర్ గోల్డ్మెడల’ అవార్డును అందుకున్నారు. కలెక్టర్ మాట్లాడు తూ జిల్లాలో రక్తదాన శిబిరాలు, తలసేమియా బాధిత చిన్నారులకు ఉచితంగా రక్తాన్ని అందించడం, విపత్తు నిర్వహణ శిక్షణ, ఆరోగ్య అవగాహన సదస్సులు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ పర్యవేక్షణలో యూత్ రెడ్‌క్రాస్, పర్యావరణ పరిరక్షణ, మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. రెడ్‌క్రాస్ ప్రతినిధులు, వలంటీర్లు, రక్తదాతల సమష్టి కృషి తోనే ఈ పురస్కారం లభించిందన్నారు. కార్యక్రమంలో జేసీ తరపున రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ జగన్మోహనరావు అవార్డును స్వీకరించగా.. ఐఆర్సీఎస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు కనుగుల దుర్గ శ్రీనివాస్, నిక్కు అప్పన్న, బి.చిన్మయిరావు, పి.వైకుంఠరావు, సన్యాసిరావు, ప్రతినిధులు కె.సత్యనారా యణ, జి.రమణ, పి.చైతన్యకుమార్, పి.రాజేష్, ఉమా, మాధవకుమార్, సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.