బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి!
అక్షర కిరణం, (కోల్‌కతా/జాతీయం): బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె కు వరుసకు సోదరడయ్యే నిహాల్ ముఖర్జీ కుమార్తె అనుమానాస్పద రీతిలో చనిపోయారు. తన ఇంటి లోనే ఆమె శవమై కనిపించారు. ఉరేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత నెలలో టీఎంసీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ పార్టీ ఆఫీసులోనే ఉరేసు కుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.
బీర్భుమ్ జిల్లా కుసుంబా గ్రామంలోని తన ఇంట్లో మంగళ వారం బ్రిస్టీ ముఖర్జీ మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. ఉరికి వేలాడుతూ కనిపించారని, దీనిని ఆత్మహత్య కేసుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. రాంపూర్ హాట్ ప్రాంతంలోని కుసుంబా గ్రామంలోని ఆమె ఇంటి రెండో అంతస్తులోని ఒక గదిలో బ్రిస్టీ ముఖర్జీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకు న్నట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపినట్లు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది.
ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసా గుతోంది. ‘మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం తరలిం చాం.. పోస్ట్‌మార్టం, విచారణ అనంతరం మరణానికి దారి తీసిన పరిస్థితులు స్పష్టమవుతాయన్నారు. కుటుంబసభ్యుల ప్రకారం.. వైవాహిక బంధం సాఫీగా సాగలేదని, విడాకుల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. కొన్నేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతోన్న బ్రిస్టీ.. వైద్య చికిత్స తీసుకుంటున్నట్టు వివ రించారు. తృణమూల్ కాంగ్రెస్ నేత బ్రిస్టీ తండ్రి నిహార్ ముఖర్జీ.. మమతా బెనర్జీకి కజిన్. బెంగాల్‌ను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో ఆమె టీచర్‌గా ఎంపికయ్యారనే ఆరోపణలను రిష్టి ముఖర్జీ ఎదుర్కొన్నారు.
అయితే, నియామక ప్రక్రియలో అవకతవకల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాలను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల తర్వాత ఆమె ఉద్యోగం కోల్పోయా రని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ముఖర్జీ మరణంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. పోస్ట్‌మార్టం నివేదికలో మృతికి గల కారణాలపై మరింత స్పష్టతనిస్తుం దని భావిస్తు న్నారు. కొద్ది రోజుల కిందట రాంపూర్‌హాట్‌లోని పార్టీ కార్యా లయంలో సీనియర్ తృణమూల్ కాంగ్రెస్ నేత, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఉరి వేసుకున్న కొద్ది రోజులకే ఆమె మరణం సంభవించింది.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన, తనపై అవినీతి ఆరోపణలను ఖండిస్తూ మరణ వాంగ్మూలం రాసిన ఆయన.. తనను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నాలు జరిగాయని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.