12 బీసీ వసతి గృహాల్లో 120 మంది బాలికలు, 236 మంది బాలురకు ప్రవేశాలు
అక్షర కిరణం, (శ్రీకాకుళం/కోటబొమ్మాళి): పేద, మధ్యతరగతి బీసీ విద్యార్థుల విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సాహం అందించడంతోపాటు, వారికి నాణ్యమైన వసతి, విద్యా సౌకర్యాలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవతో టెక్కలి డివిజన్ పరిధి లోని 12 బీసీ వసతి గృహాల్లో 2026-2027 విద్యా విద్యా సంవత్సరానికి 356 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిం చారు. సోమవారం నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాల యంలో బీసీ వసతి గృహాల అడ్వైజరీ కమిటీ చైర్మన్, రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టెక్కలి డివిజన్ పరిధిలోని బీసీ వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవేశాలపై సమీక్షించి, అర్హులైన విద్యా ర్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో మొత్తం 356 మంది విద్యార్థులకు హాస్టల్లో కొత్తగా ప్రవేశాలు లభించాయి. వీరిలో 120 మంది బాలిక లు, 236 మంది బాలురు ఉన్నారు. దీంతో గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు తమ స్వగ్రామాలకు దూరంగా చదువుకునే సమయంలో వసతి, భోజనం తది తర సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. బీసీ విద్యార్థులకు విద్యా అవకాశాలను విస్తరించడంతో వారి ఉన్నత విద్యకు, భవిష్యత్లో మెరుగైన ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం బాటలు వేస్తోందన్నారు. విద్యార్థుల సంక్షేమం, వారి ఉజ్వల భవిష్యత్తే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో టెక్కలి సహాయ బీసీ సంక్షేమాధికారి, సంబంధిత బీసీ వసతి గృహాల సంక్షేమాధికారులు తదితరులు పాల్గొన్నారు.