పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదు..
·ఎసఐఆర్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
అక్షర కిరణం, (ఢిల్లీ/జాతీయం): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్ల విచా రణ దశలో ఉండగా.. తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించిన వ్యక్తులకు ప్రభుత్వ పథకా లను నిలిపివేయకూడదని ఆదేశాలు జారీచేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. కేంద్రం, ఈసీలకు నోటీసులు జారీచేసింది. ఇదే సమయంలో ఈసీ అధికారాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఓటర్ల జాబితాపై మాత్రం దానికి అధికారం ఉంటుందని తెలిపింది.
పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎసఐఆర్) ప్రక్రియపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయ స్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని, ఓటర్ల జాబితాపై మాత్రం దానికి అథారిటీ ఉంటుందని స్పష్టం చేసింది. ఓటరు జాబితాలో పేరు లేనంత మాత్రం పౌరసత్వం పోదని తేల్చిచెప్పింది. బెంగాల్లో ఎసఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రత్యేక ట్రిబ్యునల్స్ వారి అప్పీళ్లను తిరస్కరించిన తర్వాత ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించిన వ్యక్తులకు ప్రభుత్వ పథకాల కింద లభించే సంక్షేమ ప్రయోజనాలను నిలిపివేయకూడదని కోరుతూ దాఖ లైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్ల ధర్మాసనం... కేంద్ర ఎన్నికల సంఘం, పశ్చిమ బెంగా ల్ ప్రభుత్వానికి నోటీసు జారీచేసింది. ఈ వ్యవహా రంపై జులై 25లోపు విచారణ జాబితా చేసే అవకాశం ఉందని పేర్కొంది.
పెండింగ్‌లో 34 లక్షల ఓట్లు
ప్రసేన్‌జిత్ బోస్ దాఖలు చేసిన ఈ పిటిషన్లో, ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించినంత మాత్రాన, ప్రజా పంపిణీ వ్యవస్థ, అన్నపూర్ణ పథకం, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు అందించే ఇతర సంక్షేమ పథకాల నుంచి మినహాయించకూడదని వాదించారు. పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయ వాది గోపాల్ శంకరనారాయణన్.. ప్రత్యేక ట్రిబ్యునళ్ల ముందు సుమారు 34 లక్షల అప్పీళ్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, అయితే మీడియా నివేదికల ప్రకారం ఇప్పటివరకు కేవలం 38,000 అప్పీళ్లపై మాత్రమే తీర్పు వెలువడిందని తెలిపారు.
అప్పీళ్లను విచారించేందుకు కేవలం 19 ట్రిబ్యునళ్లు మాత్రమే ఉన్నాయని, వాటిలో ఇద్దరు న్యాయమూర్తులు ఇప్పటికే రాజీ నామా చేశారని కూడా పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నుంచి తొలగింపు వల్ల కలిగే పరిణామాలను ప్రస్తావిస్తూ.. ప్రభావితమైన వారు ప్రజా సంక్షేమ పథకాలు, హక్కులకు దూరమవుతున్నారని శంకరనారాయణన్ వాదించారు.
బెంగాల్లో పథకాలు నిలిపివేత?
“ప్రస్తుతం ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించడం వల్ల ఎదురయ్యే పరిణామాలు... రేషన్, అన్నపూర్ణ పథకం, కుల ధ్రువీకరణ పత్రాలు, వెరిఫికేషన్‌పై పడుతున్నాయి” అని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు, వారి పౌరసత్వ స్థితికి సంబంధించిన సమస్యలు తుది పరిష్కారం కాకముందే ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
దీనికి జస్టిస్ జోయమాల్య బాగ్చీ స్పందిస్తూ.. బీహార్ ఎసఐఆర్ ప్రక్రియకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ అంశంపై స్పష్టతనిచ్చిందని తెలిపారు. “మాకు ఈ విషయంపై అవగాహన ఉంది.. బిహర్ ఎసఐఆర్ తీర్పులో మేము ఒక విషయాన్ని స్పష్టం చేశాం.. ఓటింగ్ హక్కులపై ఈసీఐ నిర్ణయం తీసుకున్నంత మాత్రాన అది పౌరసత్వాన్ని నిర్దారించలేదని స్పష్టం చేశాం.. పౌరసత్వ చట్టం కింద ఈ విషయాన్ని తుది పరిష్కారం కోసం సంబంధిత మంత్రిత్వ శాఖకు నివేదించాల్సిన బాధ్యత కూడా ఈసీఐకి ఉంది” అని జస్టిస్ బాగ్చి పేర్కొన్నారు.
చట్టపరంగా పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ, బాధితులు తక్షణ ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారని శంకరనారాయణన్ వాదించారు. “ఈ సంక్షేమ పథకాలన్నింటినీ వారి నుంచి తొలగిస్తారని మీరు (కోర్టు) గానీ, మేము గానీ ఊహించలేదు” అని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఓటర్ల జాబితా నుండి పేరు తొలగించడం వలన ఎదురయ్యే పరిణామాలు... రేషన్, అన్నపూర్ణ పథకం, కుల ధృవీకరణ పత్రాలు, వెరిఫికేషన్లపై పడుతున్నాయి,” అని ఆయన కోర్టుకు సమర్పించారు. అంతేకాకుండా, వారి పౌరసత్వ స్థితికి సంబంధించిన సమస్యలు తుది పరిష్కారానికి నోచుకోకముందే ప్రజలు ఈ ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బిహార్ తీర్పును ప్రస్తావించిన కోర్టు
దీనికి జస్టిస్ బాగ్చీ స్పందిస్తూ, బీహార్ ‘ప్రత్యేక ముమ్మర సవరణ’ ( SI= ) ప్రక్రియకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ అంశంపై స్పష్టతనిచ్చిందని పేర్కొన్నారు. “మాకు ఈ విషయంపై అవగాహన ఉంది. మా బీహార్ SI= తీర్పులో మేము ఒక విషయాన్ని స్పష్టం చేశాము; ఓటింగ్ హక్కులపై ఎన్నికల సంఘం ( జ్పుుI ) నిర్ణయం తీసుకున్నంత మాత్రాన, అది పౌరసత్వాన్ని నిర్ధారించలేదని స్పష్టం చేశాం. పౌరసత్వ చట్టం కింద ఈ అంశాన్ని తుది పరిష్కారం కోసం సంబంధిత మంత్రిత్వ శాఖకు రిఫర్ చేయాల్సిన బాధ్యత కూడా ఈసీఐపై ఉంది,” అని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ఓటర్ల జాబితా నుంచి తొలగించడం వల్ల ఓటు హక్కులు శాశ్వతంగా రద్దు కావని పేర్కొంది. ఓటర్ల జాబితాపై మాత్రమే ఈసీకి నియంత్రణ, పర్యవేక్షణ అధికారం ఉందని పునరుద్ఘాటించింది.