రాజ్యాంగమే గొప్పది.. పార్లమెంట్ కాదు..
కసీజేఐ బీఆర్ గవాయ్ కతీర్పులు హక్కులు పరిరక్షించేవిగా ఉండాలి
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): రాజ్యాంగంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగమే అత్యు న్నతమైంది.. న్యాయవ్యవస్థ, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ అన్నీ రాజ్యాంగ పరిధిలోనే పని చేస్తాయి’ అని ఆయన స్పష్టం చేశారు. తన సొంత రాష్ట్రం మహారాష్ట్రలోని అమరావతిలో బుధవారం జరిగిన అభినం దన సభలో జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీసుకున్న ‘రాజ్యాంగ మౌలిక నిర్మాణ సిద్ధాంతం’ గురించి ప్రస్తావించారు. ‘రాజ్యాంగాన్ని సవరించే శక్తి పార్లమెంటుకు ఉంటుంది. కానీ, అది రాజ్యాంగ మూలిక నిర్మాణాన్ని మాత్రం మార్చలేదు’ అని ఆయన తేల్చిచెప్పారు. ఇటీవల బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగిన విషయం తెలిసిందే. ‘‘ఒక న్యాయమూర్తి ప్రభుత్వానికి వ్యతి రేకంగా తీర్పులు ఇచ్చినంత మాత్రాన స్వతంత్రంగా పరిగణించలేరు. న్యాయమూర్తిగా ప్రజల హక్కుల సంరక్ష కులమన్న బాధ్యత మనపై ఉంది. రాజ్యాంగ మూలాలు, సూత్రాలను రక్షించాల్సిన కర్తవ్యం మనది’ అని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ‘ప్రజలు నా తీర్పుల గురించి ఏమనుకుంటారోనన్న ఆలోచనతో నేను తీర్పులు ఇవ్వను. నా తీర్పులు స్వతంత్రంగా, న్యాయబద్ధంగా ఉండాలి. ప్రజాభి ప్రాయం నా నిర్ణయాల్లో ప్రభావం చూపకూడదు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామ్ గవాయ్ ఆయన అన్నారు.
జస్టిస్ గవాయి గతంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ‘బుల్డోజర్ జస్టిస్’కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ. ‘నివాసం కలిగి ఉండటమనే హక్కు రాజ్యాంగంలోని ఒక ప్రధాన హక్కు’ అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు రాష్ట్రపతికి బిల్లుల ఆమోదం విషయంలో గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు సంధిస్తూ ఓ లేఖ రాయగా.. బీజేపీకి చెందిన కొందరు నేతలు కూడా సుప్రీం కోర్టును కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటోంద ని విమర్శించారు. ‘మేము (న్యాయమూర్తులు) ప్రోటోకాల్ ను అతిక్రమించి ఉంటే... ఆర్టికల్ 142 గురించి చర్చలు మొదలయ్యేవి’ అని ఆ విమర్శలకు చీఫ్ జస్టిస్ గతంలోనూ సమాధానం ఇచ్చారు. ఇక, తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. చిన్నప్పుడు తాను ఆర్కిటెక్ట్ అవ్వాలని కోరుకున్నా నని, కానీ తన తండ్రి కోరిక మేరకు న్యాయవాదిగా మారానని తెలిపారు. ‘నా తండ్రికి న్యాయవాది అవ్వాలన్న ఆశ ఉండేది. కానీ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు అరెస్ట్ కావడంతో ఆయన ఆ కలను నెరవేర్చలేకపోయారు’ అని జస్టిస్ గవాయి చెప్పారు. భారత రాజ్యాంగ సమర్ధతపై న్యాయవ్యవస్థ ఏ స్థాయిలో కట్టుబడి ఉందో చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు స్పష్టంగా సూచిస్తున్నాయి.