నీటి సరఫరా పైప్‌లైన్ పనులు త్వరితగతిన పూర్తి చేయండి
కజీవీఎంసీ కమిషనర్
అక్షర కిరణం, (అనకాపల్లి): అనకాపల్లి జోన్ లో చేపట్టిన ప్రధాన నీటి సరఫరా పైపులైన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు తాగునీటి సరఫరాను సకాలంలో సంతృప్తి స్థాయిలో అందించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన అనకాపల్లి జోన్, తుంపాల గ్రామంలో జీవీఎంసీ నీటి సరఫరా హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న అనకాపల్లి ప్రధాన నీటి సరఫరా పైపులైన్ పనులు పై సమీక్షించి, ఇప్పటికే పనులు చాలా ఆలస్యం అయ్యాయని, ఆయా పైప్ లైన్ పనులు సెప్టెంబర్ 2025 నాటికి పూర్తి అయ్యేలా గుత్తేదారులను ఆదేశించి తగిన చర్యలు చేపట్టాలని జీవీఎంసీ నీటి సరఫరా పర్యవేక్షక ఇంజనీరు కేవీఎన్ రవిని ఆదేశించారు. నీటి సరఫరా క్లోరిన్ ను పరిశీలించారు. నేటి సరఫరా సమయంలో నీటి నాణ్యతలో టర్బిడిటీ స్థాయిలను క్రమం తప్పకుండా పరిశీలించాల న్నారు. హెడ్ వాటర్ వర్క్స్‌లో ఎంతమంది ఉద్యోగులు, అధికారులు విధులు నిర్వహిస్తున్నారని ఆరా తీసారు . తాగునీటి సరఫరా లో నిత్యం ప్రజలకు అందించే తాగునీటి నాణ్యతా పరీక్షలు ఏ సమయంలో చేపడుతున్నారని వార్డు ఎమినిటీస్ కార్యద ర్శులను ఆరా తీస్తూ, వార్డులలో పర్యటిస్తూ నిత్యం ఉదయం సమయంలో ప్రజలకు అందిస్తున్న తాగునీరు నాణ్యత పరీక్షలు జరపాలని, రాత్రి సమయంలో వీధి దీపాలను పరి శీలించి అన్ని వీధిలోను వీధి దీపాలు వార్డు ఎమినిటీస్ కార్యదర్శులు విధులు నిర్వహించేలా తగిన చర్యలు చేపట్టా లని పర్యవేక్షక ఇంజనీర్ కు కమిషనర్ ఆదేశించారు.
ఈ పర్యటనలో జోనల్ కమీషనరు బి.వి.రమణ, కార్యనిర్వాహక ఇంజినీరులు ఏడుకొండలు, శేఖర్, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు గోపాలక్రిష్ణ, వార్డు ఎమినిటీస్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.