అలకనంద నదిలో బస్సు బోల్తా
క11 మంది గల్లంతు కరుద్రప్రయాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం కఏడుగురిని రక్షించిన స్థానికులు
అక్షర కిరణం, (ఉత్తరాఖండ్/జాతీయం): ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో గురువారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. రిషికేశ్- బద్రీనాథ్ జాతీయ రహదారిపై 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. రుద్రప్రయాగ్ జిల్లాలోని ఘోల్తీర్ ప్రాంతం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కనీసం ఒకరు మృతి చెందగా, మరో 10 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు ప్రయాణికులను స్థానికుల సహాయంతో రెస్క్యూ దళాలు రక్షించా యి. వీరిలో ఏడుగురికి తీవ్ర గాయాలు కావడంతో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రమాదం గురించి సమా చారం అందిన వెంటనే రాష్ట్ర విపత్తు స్పందనా దళం, స్థానిక పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభిం చాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నది లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు క్లిష్టం గా మారాయని అధికారులు తెలిపారు. హెలికాప్టర్ల సహాయం తీసుకోవాలా అనే దానిపై కూడా ఆలోచనలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై పూర్తి సమాచారం బయటకు రాలేదు. డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడా? వాహనంలో లోపమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉత్తరాఖండ్‌లో బుధవారం కురిసిన భారీ వర్షాలకు పలు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అలకనంద నదిలోనూ ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.
బస్సు నియంత్రణ కోల్పోయినట్టు ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లా పోలీస్ హెడ్డ్క్వార్టర్స్ అధికార ప్రతినిధి ఐజీ నీలేశ్ ఆనంద్ భరానే ప్రకటన విడుదల చేశారు. ‘ 18 మంది ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు నియంత్రణ కోల్పోయి రుద్రప్రయాగ్ జిల్లాలోని ఘోల్తీర్ ప్రాంతంలో అలకనంద నదిలో పడిపోయింది. సహాయక సిబ్బంది ప్రయాణికులను వెలికితీయేందుకు కృషి చేస్తున్నారు. మరిన్ని వివరాలు ఇంకా అందాల్సి ఉంది’’ అని తెలిపారు.
పౌరీ-గర్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మాట్లాడుతూ.. ‘ఒకరు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. పోలీసు, రెవెన్యూ బృందాలు ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి’ అని పేర్కొన్నారు. గల్లంతైన మరో 10 మంది ప్రయాణికుల కోసం తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో సహాయక చర్యలకు కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి.
ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ. సంబంధిత అధికారులను వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని సూచించారు. గతేడాది కూడా అలకనంద నదిలో వాహనం బోల్తాపడి 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.