విశాఖ జిల్లా జడ్జి చిన్నమశెట్టి రాజుతో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మర్యాదపూర్వక భేటీ
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నం జిల్లా న్యాయమూర్తి చిన్నమశెట్టి రాజును జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం విశాఖపట్నం జిల్లా న్యాయమూర్తి కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో కమిషనర్ కేతన్ గార్గ్ కలసి పూల మొక్కను అందించారు. ఈ సందర్భంగా మహా విశాఖ నగర పాలక సంస్థకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా న్యాయమూర్తిని కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. దీనిపై న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు.