బుడమేరు గండ్లు పూడ్చివేత పర్యవేక్షించాలంటూ నారా లోకేష్‌కు సీఎం ఆదేశం
అక్షర కిరణం, (అమరావతి): బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు ఆదేశించారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ బుడ మేరు కుడి, ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లు గురించి అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష. నిర్వహించారు. గండ్లు పూడ్చివేత పనులను పర్యవేక్షించడానికి బుడమేరు వద్దకు మంత్రి లోకేష్ బయలుదేరి వెళ్లారు. మంత్రి లోకేష్ పర్య వేక్షణలో విజయవాడలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయమే వరద బాధితుల ఇళ్లకు వెళ్లి టిఫిన్, పాలు 1200 మంది టీడీపీ కార్యకర్తలు అందజేశారు. వరద ప్రభావానికి గురైన 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వరద తగ్గు ముఖం పట్టడంతో మంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధర ణకు చర్యలు తీసుకుంటున్నారు. కాగా ప్రకాశం బ్యారేజి వద్ద భారీగా వరద తగ్గింది. ప్రస్తుత కృష్ణానదీ వద్ద ప్రవాహం 4,56,900 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు పర్య వేక్షణలో దెబ్బతిన్న గేట్ల పునరుద్ధ రణకు చర్యలు తీసుకుంటున్నారు.