మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం అండ
Åఆముదాలవలస ఎమ్మెల్యే, పీయÖసీ చైర్మన్ కూన రవికుమార్
అక్షర కిరణం, (శ్రీకాకుళం): మహిళా శక్తికి, మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో కోవే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టిక్ కుకింగ్ కాంపిటీషన్ 10 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాస్థాయి కుకింగ్ ట్రైనింగ్, వంటల పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు అందజేసి అభినంద నలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ మహిళల్లో ఉన్న సృజనాత్మకత, నైపుణ్యం, ఆత్మవిశ్వాసాన్ని వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కోవే ఆర్గనైజేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు ఔత్సాహిక పారిశ్రామిక దృక్పథాన్ని పెంపొందించేలా ఉండడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమం లో కోవే ఇండియా జాతీయ కార్యదర్శి డి.అపర్ణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు రాధిక, గురజాడ విద్యా సంస్థల డైరెక్టర్ జి. సంయుక్త, కోవే ఆర్గనైజేషన్ ప్రతినిధులు, ప్రముఖులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.