9న సమ్మెకు కౌలు రైతుల సంఘం మద్దతు
అక్షరకిరణం, (వజ్రపుకొత్తూరు): ఈనెల 9న జరిగేసార్వత్రిక సమ్మెకు కౌలు రైతులు సంఘం మద్దతు ప్రకటించింది. కార్మిక హక్కులకై జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొని కౌలు రైతుల సంఘం మద్దతిస్తుందని కౌలు రైతులు సంఘం జిల్లా నాయకులు బి.ఆనందరావు తెలి పారు. కార్మిక జీవనాడి చట్టాలను రద్దుపచ్చి కార్పొరేట్ అనుకూల చట్టాలు తెవడం కోసం నాలుగు కోడ్లుగా మార్చి కార్మికులపై దాడికి పూనుకున్నదని ఆయన అన్నారు. బీజేపీ అధికారం వచ్చిన నాటి నుండి వేతన సవరణ జరపకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. కార్మికులకు 8 గంటల పని దినాన్ని ఉండాలని పోరాటం చేసి సాధించుకున్న మే డే స్ఫూర్తిని దెబ్బతీసి 10 గంటలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఉపసంహరించుకోకపోతే ఈ సమ్మె హెచ్చరిక అవుతుందన్నారు. పని గంటలు నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం తప్పదని ఆయన అన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు స్కీం వర్కర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు పెరిగిన ధరలు కనుగొనగా ఉండాలని సిఫార్సు చేసింది, దానిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడం దారుణమని అన్నారు. కనీస వేతనం లేనీపనిని వెట్టి చాకరి అవుతుందని చట్టాలు చేసే ప్రభుత్వాలుకొట్లాదిమంది కార్మికులు చేత వెట్టి చాకిరీ చేయించుకుంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. కోట్ల రూపాయలు విలువ చేసే సే ప్రభుత్వ ఆస్తులను, పరిశ్ర మలను కారు చౌకగా కార్పొరేటర్‌కి అప్పనంగా అప్ప చెప్పే విధానాన్ని మొత్తం శ్రామిక వర్గం ప్రతికటించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.. రైతులకు గిట్టుబాటు ధర నల్ల చట్టాలు రద్దు పరిచిన స్థానే కనీసం మద్దతు ధర చట్టం చేయాలని కౌలు రైతులకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని సార్వత్రిక సమ్మెలో అంతర్భాగంగా పాల్గొంటున్నా మని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు... ఏ మండల పరిధిలో ఉన్న కౌలు రైతులు రైతులు కార్మికులు ఆయా మండల పరిధిలో హెడ్ క్వార్టర్లో జరిగే నిరసన ప్రదర్శనలో పాల్గొని ఈ నెల 9 సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు..