రాష్ట్రంలో మోడల్ మున్సిపాలిటీగా పలాస
అక్షరకిరణం, (పలాస/కాశీబుగ్గ): పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడల్ మున్సిపాలిటీ గా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పలాస కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు స్పష్టం చేశారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు సూచనల మేరకు అన్ని వార్డుల్లో పారి శుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇంటింటా చెత్త సేకరణకు అవసరమైన పుష్-కార్ట్స్ను శర వేగంగా తయారు చేయిస్తున్నట్లు చెప్పారు. పుష్కార్ట్స్ను తయారీ విధానాన్ని పర్యవేక్షించి సూచనలు చేశారు. పారి శుధ్యం మెరుగుతోపాటు పరిసరాలు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు కమిషనర్ రామారావు తెలిపారు.