అర్థరాత్రి పారిశుధ్య పనులు పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖ నగరంలో రాత్రిపూట పారిశుధ్య పనులను మరింత మెరుగుపరచా లని ప్రజారోగ్య అధికారులను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. ఆదివారం అర్ధరాత్రి ఆయన రాత్రి పారిశుద్ధ్య పనుల 7వ ప్యాకేజ్లోని సంపత్ వినాయక టెంపుల్ రోడ్డులో అర్థరాత్రి పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. ఈసందర్భంగా రాత్రిపూట పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వ్యర్ధాలు తరలించే టాటా ఏస్ వాహన డ్రైవర్లు, లోడర్లతో మాట్లాడి వారి పని తీరు, విధుల వివరాలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.
విశాఖ నగర పరిశుభ్రత, సుందరీకరణ దృష్ట్యా రోడ్లపై, ఫుట్ పాత్లపై వ్యర్ధాలు లేకుండా నిర్ణీత సమయంలో పారిశుద్ధ్య కార్మికులు అలసత్వం వహించకుండా పరిశుభ్రపరచాలని, రోడ్లపై చెత్త పోగులు లేకుండా వ్యర్ధాలను ఎప్పటికప్పుడు వెంటనే వాహనాలలో తరలించాలని, పరిశుభ్రతా ప్రమాణా లను కచ్చితంగా పాటించి పారిశుద్ధ్య పనుల పనితీరును మెరుగుపరచాలని, విశాఖ నగర పరిశుభ్రతకు, సుందరీక రణకు కృషి చేసేలా చర్యలు చేపట్టాలని సోమవారం ఉదయం జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈఎన్వీ నరేష్ కుమార్కు కమిషనర్ ఆదేశించారు.