స్వచ్ఛ రథాలను ప్రారంభించిన జీవీఎంసీ కమిషనర్
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖ నగర ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ విశాఖ నగర పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. సోమవారం ఆయన హెచ్పీసీఎల్ విశాఖ రిఫైనరీ, జీవీఎంసీతో కలసి సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా పక్వాడ (స్వచ్ఛత పక్షోత్సవాలు)కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హెచ్పీసీిఎల్ విశాఖ రిఫైనరీ ప్రధాన కార్యా లయం వద్ద హెచ్పీసీిఎల్ విశాఖ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (వీఆర్) రమేష్ కృష్ణన్, సీజీఎం-హెచ్ఆర్ గంటా కిరణ్ కుమార్తో కలసి స్వచ్ఛ రథాలను జెండా ఊపి ప్రారం భించారు. అనంతరం హెచ్పీసీిఎల్ విశాఖ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (వీఆర్) రమేష్ కృష్ణన్ మాట్లాడుతూ విశాఖ నగరంలో హెచ్పీసీఎల్ విశాఖ రిఫైనరీ ప్రతి సంవత్సరం స్వచ్చ విశాఖ అభివృద్ధి, విశాఖ నగర పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రజల అవగాహన కొరకు స్వచ్ఛత పక్వాడా కార్యక్రమాలు జీవీఎంసీతో కలిసి 15 రోజులపాటు నిర్వహిస్తారని తెలిపారు. జీవీఎంసీ అన్ని జోన్లలో ప్రచారం కోసం 8 స్వచ్ఛ రథాలు, నాలుగు బృందాలతో వీధి నాట కాలు, ఒక పప్పెట్ షో బృందాన్ని, 3 ఎఫ్ఎం రేడియోల ద్వారా బ్రాడ్ కాస్టింగ్ కార్యక్రమాలను, నగరంలో 12 పెద్ద సైజు హోర్డింగ్లను ఏర్పాటు చేశారని తెలిపారు. అనంతరం కమిషనర్ హెచ్పీసీిఎల్ అధికారులతో కలిసి స్వచ్ఛ రథాలను ప్రారంభించి, వస్త్ర సంచులను ప్రదర్శించారు. కార్యక్రమంలో జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈఎన్వీ నరేష్కుమార్, హెచ్పీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్లు, ఉన్నతాధికారులు, పీఆర్ కన్సల్టెంట్ ఎంకేవీఎల్ నరసింహం ( కాళీ), శానిటరీ సూపర్వైజర్ జనార్దన రావు తదితరులు పాల్గొన్నారు.