జడ్జిపై తెలుగు లాయర్ అనుచిత వ్యాఖ్యలు: తీవ్రంగా స్పందించిన సీజేఐ
అక్షరకిరణం, (ఢల్లీి/జాతీయం): తమకు అను కూలంగా తీర్పు రాకపోతే న్యాయమూర్తులపై అవమానకర మైన ఆరోపణలు చేస్తోన్న ధోరణి ఆందోళన కలిగిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ చెందిన ఎన్ పెద్దిరాజు కోర్టు ధిక్కార కేసులో సోమవారం వాదనలు సందర్భంగా సీజేఐ స్పందించారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసుమి భట్టాచార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పెద్దిరాజు తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. పెద్దిరాజు క్షమాపణలను జస్టిస్ భట్టాచార్య అంగీకరించారని సీనియర్ లాయర్ సంజయ్ హెగ్డే తెలియజేయడంతో ఈ కేసును సుప్రీంకోర్టు ముగించింది. అయితే, తాను ఈ పరిణామంతో సంతృప్తి చెందలేదని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. ‘‘ఇలాంటి చర్యలను తీవ్రం గా ఖండిరచాలి’’ అని ఆయన అన్నారు.
‘ఈ న్యాయస్థానం 1954లోనే స్పష్టంగా చెప్పింది%ౌ% కోర్టు అధికారులుగా లాయర్లు న్యాయస్థానం పట్ల తమ కర్తవ్యాన్ని గుర్తుంచుకోవాలి. చట్టం గొప్పతం శిక్షించడంలో కాదు, క్షమాపణ చెప్పినప్పుడు క్షమించగల సామర్థ్యంలో ఉంటుం ది. ఆరోపణలు ఎదుర్కొన్న హైకోర్టు లాయర్ క్షమా పణలను న్యాయమూర్తి స్వీకరించినందున, మేము ఈ వ్యవహారాన్ని ఇక ఇంతటితో ముగిస్తున్నాం’’ అని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. ‘ఏది ఏమైనప్పటికీ కోర్టు అధికారులుగా లాయర్లు ఏదైనా కోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేసే పిటిషన్లపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాం’ అని అన్నారు.
కాగా, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై తీవ్రమైన ఆరోపణలు చేసిన కేసులో ఈ ఏడాది జులైలో పెద్దిరాజు సహా లాయర్లకు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార నోటీసులు జారీచేసింది. అంతేకాదు, షోకాజ్ నోటీసు జారీచేస్తూ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి నిరాకరించింది. ‘‘ఒక న్యాయమూర్తిపై అలాంటి ఆరోపణలు చేయడానికి మేము ఏ న్యాయవాదిని అనుమతించలేం’’ అని పేర్కొంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నమోదయిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో న్యాయమూర్తిపై లాయర్లు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆ తీర్పుతో అసంతృప్తి చెందిన లాయర్.. సుప్రీం కోర్టును ఆశ్రయించి, కేసును మరో న్యాయమూర్తికి బదిలీ చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమీ భట్టాచార్యపై పక్షపాతం, అనుచిత ప్రవర్తన ఆరోపణలు చేయడం గమనార్హం.