భారత ఏ జట్టుకు టెక్కలి ఆల్రౌండర్ విజయ్ ఎంపిక
Åఅభినందించిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు
అక్షర కిరణం, (టెక్కలి): టెక్కలికి చెందిన యువ ఆల్ రౌండర్ త్రిపురాన విజయ్ భారత ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా ఏ జట్టుతో పుదుచ్చేరీలో ఈ నెల 22వ తేదీ నుంచి జరగనున్న నాలుగు రోజుల రెండు క్రికెట్ మ్యాచ్లకు బీసీసీఐ అతడిని భారత జట్టుకు ఎంపిక చేసింది. ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో త్రిపురాన విజjáYT తన ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి తన ఆల్ రౌండ్ నైపుణ్యంతో సత్తా చాటిన విజయ్.. ఇప్పుడు భారత ఏ జట్టులో చోటు దక్కించుకోవడంపై రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన యువ కెరటం త్రిపురాన విజయ్ భారత ఏ జట్టుకు ఎంపిక కావడం జిల్లా ప్రజలందరికీ ఎంతో గర్వకారణమన్నారు. పట్టుదల, నిరంతర శ్రమ ఉంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని విజయ్ నిరూపించా డని కొనియాడారు. ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగే మ్యాచ్లో సైతం మరింతగా రాణించి, భారత సీనియర్ జాతీయ జట్టులో కూడా స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. విజయ్ తండ్రి కృష్ణంరాజుకు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.