వైసీపీ భీమిలి ఇన్చార్జిగా బొత్స అనూష నియామకం
2029లో చీపురుపల్లిలో పోటీ: బొత్స సత్యనారాయణ
అక్షర కిరణం, (భీమునిపట్నం): వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. మజ్జి శ్రీను పార్టీని వీడటంతో ఖాళీగా ఉన్న భీమిలి నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్‌ను ప్రకటించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూషను భీమిలి వైఎస్సార్సీపీ ఇంఛార్జ్‌గా నియ మించారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బొత్స అనూషను భీమిలి అసెంబ్లీ నియో జకవర్గ సమన్వయకర్తగా నియమించారని ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గం లో పార్టీ కార్యక్రమాల సమన్వయం, నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయ ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి బొత్స సత్యనారాయణ తన కుమార్తె బొత్స అనూష ఇటీవల విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికల బరిలో ఉంటారని ప్రకటించారు. ఈలోపే మజ్జి శ్రీను టీడీపీలో చేరడంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. దీంతో అనూషను భీమిలి నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించారు.
భీమిలి నియోజకవర్గం ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించి న వైఎస్ జగన్‌కు అనూష ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. భీమిలి ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటానని.. జగన్ మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్తానని బొత్స అనూష తెలిపారు.
ప్రతి రోజు కార్యకర్తలు చిన్ని శ్రీనుఅపాయిట్మెంట్ కోసం ఎదురు చూసేవారన్నారు బొత్స అనూష. ఒకరు వెళ్లిపోతే.. కార్యకర్తలకు ఇద్దరు వచ్చారన్నారు.. తాను, తన తమ్ముడు, తన తండ్రి కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ మారిన వారికి ఓటుతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు అందరూ బొత్స 1.0 చూశారని.. ఇక నుంచి బొత్స 2.0 చూస్తారంటూ ఘాటుగా స్పందించారు. చీపురుపల్లి కార్యకర్తల వల్లే తన తండ్రికి ఓ బ్రాండ్ వచ్చిందన్నారు. అలాగే గ్రామాల్లో ఏకగ్రీవాలు జరగకూడదని వైఎస్ జగన్ చెప్పారని..ప్రతి ఒక్కరూ కష్టపడి స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు.
మరోవైపు బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. తాను 2029 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. గరివిడిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వచ్చే ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇచ్చారు. తన ఆరోగ్యం బాగాలేదని అందుకే ప్రత్యక్ష రాజకీయాలు కాకుండా రాజ్యసభకు వెళతానంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తన బదులు తన పిల్లలు అనూష, సందీప్ ఎన్నికల్లో పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోందని.. అందుకే తాను ఈ అంశంపై స్పందిస్తున్నట్లు తెలిపారు. తనతో ఆర్థిక సంబంధాలున్నవారు పార్టీని వీడుతున్నారని.. పార్టీ విషయంలో నిబద్దతతో ఉన్నవారు ఎవరు వెళ్లడం లేదన్నారు.