నిమ్మకూరులో జేఈఈ, నీట్ అకాడమీ ఏర్పాటు..
Åమంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సొంత గ్రామం నిమ్మకూరుకు తీపికబురు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కృష్ణా జిల్లా నిమ్మకూరు ఏపీఆర్జేసీలో జేఈఈ, నీట్ అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రి లోకేష్ అధ్యక్షతన ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఆరఈఐఎస్) గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఏపీ రెసిడెన్షియల్ పాఠ శాలల్లో అంతర్జా తీయ ప్రమాణాలు పాటిస్తూ ప్రతిభా వంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని.. అకడమిక్ ఎక్స్‌లెన్స్‌పై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.
రాష్ట్రంలో 10 ఏపీఆరఈఐఎస్లను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తాడికొండ, కొడిగినహళ్లి పాఠశాలలు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లుగా మార్చగా.. ఆరు పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసేందు కు ఈ సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బోధన, బోధనేతర సిబ్బందిని నియమిం చేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం భూపతిపాలెం స్కూల్‌ను వరల్డ్ క్లాస్ ఎకోసిస్టమ్ అభివృద్ధిపరిచి, విద్య, క్రీడా హబ్‌గా తీర్చిదిద్దాల న్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్స్, ఏఐ నైపుణ్యం తప్పనిసరి చేయాలని కూడా మంత్రి లోకేష్ ఆదేశిం చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేయాలని కూడా సూచనలుచేశారు.
సిబ్బంది సర్వీసు రూల్స్ కోసం కమిటీ, ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్ల పెంపు ప్రతిపాదనకు ఓకే చెప్పారు. ఇతర సొసైటీలతో సమానంగా గెస్ట్ లెక్చరర్లకు గౌరవ వేతనాలను ఇవ్వాలని.. పీఈటీలను పీడీలుగా అప్‌గ్రేడ్ చేయా లని నిర్ణయించారు. ఒకవేళ విద్యార్థులకు ఏదైనా అత్యవసర వైద్య సదుపాయం అవసరమైతే రూ.లక్ష వరకు ఖర్చు చేసే వెసులుబాటు కల్పించారు. అంతేకాదు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడి యట్ 78వ పాలకవర్గ సమావేశం మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, మూల్యాం కనం, సిబ్బందికి భత్యం పెంపుపై నిర్ణయాలు తీసుకున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో పాత సర్టిఫికెట్లన్నింటినీ డిజిటలైజ్ చేయనున్నారు. అంతేకాదు పరీక్షలకు సంబంధించి పాలకవర్గ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.