ఇకపై మీ ఇళ్లకు ఎలాంటి భయం లేదు
Åసీఎం చంద్రబాబు Åపేదలకు పట్టాభిషేకంలో 28,445 ఇళ్ల పట్టాల పంపిణీ
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఇకపై మీ ఇళ్లకు ఎలాంటి భయం లేదని, పేదలకు సొంత ఇళ్లు ఉండాలన్న ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విశాఖపట్నం పర్యటన సందర్బంగా ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మీరు ఉంటున్న ఇళ్లపై సర్వహక్కులు ఇక నుంచి మీవే. మీ ఇళ్లపై ఎలాంటి వివాదం లేదు.. భయం లేదు్ణ అని చంద్రబాబు అన్నారు. పట్టాలు పొందిన తర్వాత అవసరమైతే ఇళ్లపై బ్యాంకు రుణాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇళ్ల హక్కు పత్రాలు అందుకోవడంతో పేద కుటుంబాలకు ఆస్తిపై భద్రత ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు తెలిపారు. పోలవరం ఎడమ కాలువను పూర్తి చేసి అనకాపల్లికి నీటిని అందించడంతో పాటు విశాఖకు గోదావరి జలాలను తీసుకొస్తామని చెప్పారు. ఉత్తరాంధ్రలో గత రెండేళ్లలో 91 ప్రాజెక్టులు వచ్చాయని, ఈ ప్రాంతానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించామని చంద్రబాబు పేర్కొన్నారు. మొత్తంగా రూ.5.37 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. విశాఖ నగరం త్వరలో విశ్వనగరంగా ఎదగనుందని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు గేమ్‌చేంజర్‌గా మారనుందని తెలిపారు. విశాఖలో నీటి సమస్య లేకుండా వచ్చే ఏడాదిలోగా పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, భవిష్యత్తులో నీటి కొరత రాకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తిరుపతిలో 89.41 శాతం పచ్చదనం ఉందని, విశాఖను కూడా అదే స్థాయికి తీసుకెళ్లాలనేది తన లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, అనేక భూ కుంభకోణాలు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు. వాటన్నింటినీ అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో శాంతి లేకుండా చేశారని విమర్శించారు. రుషికొండలో నిర్మించిన భవనాలను వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు. ఎన్ని డేటా సెంటర్లు వచ్చినా విశాఖకు నీటి ఇబ్బంది లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కూటమి ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందని, పేదలకు ఇస్తున్న పట్టాలు వారి పిల్లల భవిష్యత్తుకు పట్టాభిషేకం వంటివని అన్నారు. రైల్వే జోన్ రావడంతో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
వైసీపీ పాలన రాష్ట్రానికి ఒక పీడకలని సీఎం చంద్రబాబు విమర్శిం చారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూకబ్జాలకు పాల్పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ కుట్రలు ఆగలేదని, మెగా ణS్పుపై అనేక కేసులు వేశారని అన్నారు. కోర్టులు చివాట్లు పెట్టడంతో ఇప్పుడు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విశాఖకు కంపెనీలు రాకుండా తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. దేవాలయ భూములకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులను తొలగిస్తామని తెలి పారు. గత రెండేళ్లలో 5.50 లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చామని, వచ్చే మార్చిలో మరో 5.52 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.