కొండవాలు ప్రాంతాల్లో టీడీపీ నాయకుల పర్యటన
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): జీవీఎంసీ 12వ వార్డు పాత ఆరిలోవ బీసీ కాలనీ కొండవాలు ప్రాంతంలో టీడీపీ నాయకులు పర్యటించారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆదేశాల మేరకు ఇటీవల కురిసిన వర్షాల వలన ఒక పెద్ద బండరాయి పడి పోయే స్థితిలో ఉండడంతో సోమవారం టీడీపీ సీనియర్ నాయకులు విస్తృతంగా పర్యటించి కొండవాలు ప్రాంతాలన్నీ పరిశీలించారు. వారు మాట్లాడుతూ తమ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పునరావాస కేంద్రాలు ఏ ర్పాటు చేశామని తెలిపారు. వర్షాకాలం సందర్భంగా అంద రూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమం లో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒమ్మి సన్యాసిరావు, 11వ వార్డ్ అధ్యక్షులు ముగడ రాజారావు, 12వ వార్డ్ అధ్య క్షులు గాడి సత్యం, 9వవార్డ్ ఇంచార్జ్ బుడుమూరి గోవింద్, జిల్లా పార్లమెంటరీ సెక్రెటరీ ఒమ్మి పోలారావు, నమ్మి గణేష్, కొల్లి ఎర్రాజీరావు, గొలగాని రాంబాబు పాల్గొన్నారు.