తిరుమలలో గో బ్యాక్ జగన్ అంటూ స్వాముల నిరసన
అక్షర కిరణం, (తిరుమల): తిరుమలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చేదు ఘటన ఎదురైంది. పలువురు స్వాములు నిరసనకు దిగారు. గో బ్యాక్ జగన్ అంటూ గురువారం అలిపిరి వద్ద శ్రీనివాస ఆనంద స్వామీజీతోపాటు పలువురు స్వాములు ఆందోళనకు చేపట్టారు. గో బ్యాక్ క్రిస్టియన్ జగన్ అంటూ ప్లే కార్డ్స్‌తో నినాదాలు చేశారు. తిరుమల లడ్డూ వివాదంలో ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 28న తిరుపతికి వెళ్లనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈక్రమంలో తిరుమలలో పలువురు స్వాములు నిరసనకు దిగారు. గో బ్యాక్ జగన్ అంటూ గురువారం అలిపిరి వద్ద శ్రీనివాస ఆనంద స్వామీజీతో పాటు పలువురు స్వాములు ఆందోళనకు చేపట్టారు. గో బ్యాక్ క్రిస్టియన్ జగన్ అంటూ ప్లే కార్డ్స్‌తో నినాదాలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు భార్యతో వచ్చి పట్టువస్త్రాలు సమర్పించని జగన్ ఇప్పుడు ఎందుకు తిరుమలకు వస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నో ఆలయాలపై దాడి జరిగినప్పుడు నోరు మెదపని జగన్ ఇప్పుడు ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టారని నిలదీశారు. ఏ మొహం పెట్టుకొని జగన్ తిరుమలకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని స్వాములు స్పష్టం చేశారు. తమపైన ఆయన వాహనాలు ఎక్కించు కొని తిరుమలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. జగన్ పర్యటన సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమైతే జగనే బాధ్యత వహించాల్సి వస్తుందని స్వాములు హెచ్చరించారు.