పెందుర్తి రైతుబజార్లో స్వచ్ఛతహి సేవ
అక్షర కిరణం, (పెందుర్తి): జీవీఎంసీ స్వచ్ఛతహి సేవలో భాగంగా పెందుర్తి రైతు బజార్లో రైతు బజార్ సిబ్బందికి వినియోగదారులకు స్వచ్ఛతపై, ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్ధాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణంపై అవగాహన కలిగి తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర చెత్తను వేరు చేస్తూ జీవీ ఎంసీకి అందించాలన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాల ని శుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని సూచించారు. సమావేశానికి 96వ వార్డు శానిటేషన్, ఎన్వీరాన్మెంట్ సెక్రటరీ బాలి రవితేజ, 96వ వార్డు శానిటేషన్ సిబ్బంది, పెందుర్తి ఈవో షర్మిల, రైతు బజార్ సిబ్బంది, రైతులు, వినియోగదారులు పాల్గొన్నారు.