సింహగిరిపై ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
అక్షర కిరణం, (సింహాచలం): సింహగిరిపై శనివారం స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రత్యేక పరిశుభ్రత కార్యక్ర మాన్ని నిర్వహించారు. రాజగోపురం ఎదురుగా నిర్వహిం చిన ఈకార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో చేపట్టారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు భక్తులకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది శ్రమదానం చేశారు. అనంతరం ఆలయ ఉద్యోగులు, సిబ్బందితో ‘స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈఓ జల్లేపల్లి వెంకట్రావు, సహాయ కార్యనిర్వహణాధికారి పిల్లా శ్రీనివాd Ÿరావు ప్రతిజ్ఞ చేయించారు. ఆలయ ఉద్యోగులు, పరిపాలనా విభాగపు పర్యవేక్షణ అధికారి రాజ్యలక్ష్మి, శానిటరీ పర్యవేక్షణ అధికారి ఎస్.కనకరాజు తదితరులు పాల్గొన్నారు.