మంత్రి అచ్చెన్నాయుడుతో గ్రాన్యూల్స్ ఇండియా ప్రతినిధుల భేటీ
ÅమÖలపేటలో పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి
అక్షర కిరణం, (శ్రీకాకుళం/కోటబొమ్మాళి): జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేసి, స్థానికంగా ఉపాధి, ఆర్థిక అవకాశాలను పెంపొందించేందుకు ప్రభు త్వం చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల ఫలితాలు కనిపిస్తు న్నాయి. మూలపేటలో ఇప్పటికే కోరమాండల్ సంస్థ పరి శ్రమ స్థాపనకు ముందుకు రాగా, తాజాగా ప్రముఖ ఔషధ తయారీ సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కూడా అదే ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడం జిల్లాకు శుభపరిణామమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
శనివారం నిమ్మాడలోని మంత్రి కార్యాలయంలో గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు మంత్రిని మర్యాదపూర్వ కంగా కలిశారు. మూలపేటలో తమ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్నట్లు వివరించారు. పరిశ్రమ ఏర్పాటు కు అవసరమైన భూ కేటాయింపులు, విద్యుత్, నీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని సంస్థ ప్రతినిధులు మంత్రిని కోరారు.
మంత్రి మాట్లాడుతూ పరిశ్రమ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. భూ కేటాయింపులతోపాటు అవసరమైన మౌలిక వసతుల కల్పన, ఇతర ప్రభుత్వ అనుమతుల విషయంలో కూడా నిబంధనల మేరకు వేగంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మూలపేటలో కోర మాండల్తోపాటు గ్రాన్యూల్స్ ఇండియా వంటి సంస్థలు పరి శ్రమలు ఏర్పాటు చేయడంతో ఈప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతోపాటు జిల్లా సమగ్రాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు ఆశా భావం వ్యక్తం చేశారు.