జీవీఎంసీ స్పోర్ట్స్ అరేనాను సందర్శించిన చైనా క్రీడా ప్రతినిధి బృందం
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖ వేదికగా జరు గుతున్న అంతర్జాతీయ బ్రిక్స్ కార్యక్రమం సందర్భంగా చైనా కు చెందిన ఉన్నత స్థాయి క్రీడా ప్రతినిధి బృందం శనివారం జీవీఎంసీ ఈస్ట్ జోన్, ఎంవీపీ కాలనీలోని జీవీఎంసీ స్పోర్ట్స్ అరేనా ను సందర్శించింది. చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ వైస్ మినిస్టర్ కుయ్ జియాన్ నేతృ త్వంలోని ప్రతినిధి బృందానికి జీవీఎంసీ అదనపు కమిషనర్ పల్లి నల్లనయ్య స్వాగతం పలికారు. ప్రతినిధులు యువ క్రీడాకారులు, విద్యా ర్థులతో మమేకమై వారి క్రీడా శిక్షణ, వివిధ క్రీడాంశాల్లో అందిస్తున్న ప్రోత్సాహం, ప్రతిభాభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. చిన్నారులకు బహుమతులు అందించి వారిని ప్రోత్సహించారు. ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న క్రీడాబి óవృద్ధి కార్యక్రమాలు, వివిధ స్థాయిల్లో పోటీల నిర్వహణతో క్రీడాకారులకు కల్పిస్తున్న అవకాశాలను ప్రతినిధి బృందానికి వివరించారు. రాష్ట్రంలో నిర్వహించిన జాతీయ, అంతర్జా తీయ క్రీడా కార్యక్రమాల గురించి కూడా తెలియజేశారు. కుయ్ జియాన్ మాట్లాడుతూ క్రీడలంటే ప్రత్యర్థిని ఓడిం చడం మాత్రమే కాదని, తనను తాను అధిగమిస్తూ నిరం తరం మెరుగుపరుచుకోవడం, అపజయాల నుంచి తిరిగి నిలబడే ధైర్యాన్ని పెంపొందించుకోవడం కూడా క్రీడా స్ఫూర్తి లో భాగమన్నారు. ప్రతినిధులు జీవీఎంసీ స్పోర్ట్స్ అరేనాలోని జిమ్నాజియం, స్విమ్మింగ్ పూల్ తదితర క్రీడా సదుపాయా లను పరిశీలించి అభినందించారు. స్నేహం, సాంస్కృతిక మార్పిడికి గుర్తుగా చైనా ప్రతినిధి బృందం ‘రెడ్ హార్స’ చిత్రం తో కూడిన జ్ఞాపికను అందజేసింది. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ జాన్ జూలియట్, జీవీఎంసీ ఈస్ట్ జెడ్సీ కె.శివప్రసాద్, జీవీఎంసీ స్పోర్ట్స్ డైరెక్టర్ ఈ.అప్పలరాజు, సహాయక వైద్యాధికారి బి.ప్రసాదరావు పాల్గొన్నారు.