ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ప్రశ్నాపత్రం లీకేజీ
Åపరీక్ష జరిగిన కొద్ది గంటల్లోనే రద్దు చేసిన అధికారులు
అక్షర కిరణం, (ఛత్తీస్‌గఢ్/జాతీయం): ఛáత్తీస్ గఢ్లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వ విద్యా లయంలో ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలు రావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ విశ్వవిద్యా లయం పరిధిలో గురువారం నిర్వహించిన బీఎస్సీ అగ్రికల్చర్ సెమిస్టర్ పరీక్ష జరిగిన కొన్ని గంటల్లోనే అధికారులు దానిని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సామాజిక మాధ్యమమైన వాట్సాప్‌లో హల్చల్ చేసిన ఒక ప్రశ్నపత్రం, అసలు పరీక్ష పత్రంతో దాదాపు 70 శాతం మేర సరిపోలడంతో విశ్వవిద్యా లయ యాజమాన్యం తక్షణ చర్యలకు ఉపక్రమించింది.
34 కళాశాలలు.. 500 మంది విద్యార్థులకు షాక్!
రాయ్‌పూర్‌లోని ఇందిరాగాంధీ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఛత్తీస్‌గఢ్ వ్యాప్తంగా ఉన్న 34 కళాశాలల్లో గురువారం ఈ పరీక్ష జరిగింది. ముఖ్యంగా బీఎస్సీ అగ్రికల్చర్ ద్వితీయ సంవత్సరం, రెండవ సెమిస్టర్‌కు చెందిన ‘ఎంటమాలజీ’ (ఏఈఎన్టీ 221) పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించారు. దాదాపుగా 500 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజర య్యారు. అయితే పరీక్ష పూర్తయిన వెంటనే వాట్సాప్‌లో సర్క్యులేట్ అయిన పేపర్, అసలు ప్రశ్నాపత్రంతో 70 శాతం వరకు పోలి ఉండటంతో లీకేజీ వ్యవహారం బయటపడింది.
విద్యార్థి సంఘాల ఆందోళనతో విచారణ కమిటీ ఏర్పాటు
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో మధ్యాహ్నం సమ యంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎనఎస్‌యూఐ) ప్రతి నిధు లు విశ్వవిద్యాలయ ప్రాంగణానికి చేరుకుని భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఆ తర్వాత అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కూడా వర్సిటీ వద్ద ధర్నా చేసి లీకేజీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తీవ్ర ఆరోపణ ల నేపథ్యంలో విశ్వవిద్యాలయ యాజమాన్యం ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కపిల్‌దేవ్ దీపక్ మాట్లాడూ,.. “పరీక్షకు ముందే విశ్వవిద్యాలయం లోపలి నుంచి ఏమైనా సమాచారం లీక్ అయిందా లేదా అనే విషయాన్ని నిగ్గు తేల్చేందుకు పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించాం. విచారణలో నిజాలను బయటకు తీస్తాం’ అని వెల్లడించారు.
సెప్టెంబర్‌లో మళ్లీ పరీక్ష నిర్వహణ
ప్రశ్నాపత్రం లీకేజీపై విశ్వవిద్యాలయ అధికారులు రాయ్‌పూర్ లోని తేలీబంధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించారు. ఈక్రమంలోనే వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ / కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. ఏఈఎన్టీ 221 పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రద్దయిన ఈ పరీక్షను సెప్టెంబర్ మొదటి వారంలో తిరిగి నిర్వహిస్తామని, కచ్చితమైన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వర్సిటీ స్పష్టం చేసింది.