సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీం కోర్టులో ఊరట
కబెయిల్ మంజూరు చేసిన సుప్రీం ధర్మాసనం
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. కొమ్మినేనిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన విడుదలకు సంబం ధించిన అన్ని నిబంధనలు ట్రయల్ కోర్టు ఇస్తుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం తెలిపింది. వాక్ స్వాతంత్రన్ని రక్షించాలని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అని వ్యాఖ్యానించింది. డిబేట్లో కొమ్మినేని నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా అని ప్రశ్నించింది.. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా తాము కూడా నవ్వుతుంటామని.. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేని శ్రీనివాసరావుకు సంబంధం లేదని అభిప్రాయ పడిరది. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలని.. విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్ కోర్టు విధిస్తుందన్నారు.
కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమమని దాఖలైన పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేశారని.. మూడేళ్లలోపు శిక్షపడే నేరాలకు పోలీసులు ముందుగా 41 కింద నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతు న్నాయని కొమ్మినేని తరఫు లాయర్ కోర్టుకు విన్నవించారు. నోటీసు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారని..
సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు పాటించలేదన్నారు. డిబేట్లో గెస్ట్ (విశ్లేషకులు) చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారని.. అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని గెస్ట్‌ను కొమ్మినేని నియంత్రించారని.. ఆయన ఆ వ్యాఖ్యల్ని సమర్థించలేద న్నారు. శ్రీనివాసరావును తెలం గాణలో అరెస్టు చేసి 331 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్‌ల రిమాండ్ చేశారన్నారు.
కొమ్మినేనిని ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోలేదని.. ఆయన సీనియర్ జర్నలిస్టు అని, ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదని లాయర్ కోర్టుకు తెలిపారు. శ్రీనివాసరావు 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్.. దర్యాప్తును తప్పించుకునే ప్రయత్నం చేయలేదన్నారు. స్థానిక కోర్టులో కొమ్మినేని తరఫున లాయర్‌ను అనుమతించలేదని.. సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధమన్నారు. ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19, 21 ,22(1)ను ఉల్లంఘించారని.. ప్రజాస్వామ్య నాలుగో స్తంభమైన మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాక్ స్వాతంత్రానికి భంగం కలిగిస్తున్నా రని.. అక్రమ అరెస్టుతో ఆయన జీవించే హక్కుకు భంగం కలిగిందన్నారు. ఈ వాదనల్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ధర్మాసనం కొమ్మినేని విడుదలకు అనుమతించింది. అమరావతి మహిళల్ని కించపరిచేలా ఓ న్యూస్ ఛానల్ డిబేట్లో వ్యాఖ్యలు చేశారంటూ.. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటుగా విశ్లేషకుడు కృష్ణంరాజులపై కేసు నమోదైంది. ఈ క్రమంలో ఈ నెల 9న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.. అక్కడి నుంచి గుంటూరుకు తరలించి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే కొమ్మినేని తరఫున సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. ఆయన్ను ధర్మాసనం విడుదల చేయాలని ఆదేశించింది.