సబ్ జూనియర్స్ టెన్నికాయిట్ జిల్లా బాలబాలికల జట్లు ఎంపిక
అక్షరకిరణం, (పలాస): ప్ర్రభుత్వ ఉన్నత పాఠశాల పలాస క్రీడా మైదానంలో శ్రీకాకుళం జిల్లా టెన్నికాయిట్ సబ్ జూనియర్ బాలబాలికల ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్లా భద్రయ్య, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు టి.చిట్టిబాబు, టెన్నికాయిట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు పి. తవిటయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు బి.శంకరరావు ఆర్. శ్రీనివాసరావు హాజరయ్యారు. న్యాయ నిర్ణేతలుగా పి. సునీత, ఎం.దామోదర్, రామయ్య, షాజహాన్ వ్యవహరించారు. బాలుర జట్టుకు టి.వెంకటేష్, కే.జయంత్ (పలాస) టి.అభిరామ్, డి. భార్గవ్, బాలికల జట్టుకు పి. శ్రావణి, వై. వరలక్ష్మి, ఎన్ దివ్య, ఆర్.పవిత్ర ఎంపికైనట్లు జిల్లా టెన్నికాయిట్ సంఘం కార్యదర్శి ఎస్వీ జోగారావు తెలియజేశారు.