బీహార్ అశోక్ ధామ్ ఆలయంలో తొక్కిసలాట..
Åఅరుగురు మృతి Åపలువురికి తీవ్ర గాయాలు
అక్షరకిరణం, (బిహార్/జాతీయం): బీహార్లోని ప్రముఖ అశోక్ ధామ్ ఆలయం వెలుపల శ్రావణమాసం తొలి సోమవారం తీవ్ర విషాదం చోటు చేసు కుంది. దైవ దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో బారికేడ్లు విరిగి పడ్డా యి. దీంతో భక్తులంతా ఒక్కసారిగా బయటి వైపు పరు గులు తీయడంతో.. తొక్కిసలాట జరిగింది. ఈదుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 10 నుంచి 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రు లను ఆస్పత్రికి తరలించారు.
బీహార్లోని లఖీసరాయ్ జిల్లాలో ఉన్న ప్రముఖ అశోక్ ధామ్ ఆలయ ప్రాంగణం వెలుపల సోమవారం ఉదయం తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దురదృష్టకర సంఘట నలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయ పడ్డారు. శ్రావణ మాసపు తొలి సోమవారం కావడంతో పరమశివుడిని దర్శించుకుని పూజలు నిర్వ హించేందుకు వేలాదిగా భక్తుల తరలిరావడంతో.. ఆలయ పరిసరాలు అత్యంత రద్దీగా మారాయి. ఈక్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
క్యూలైన్లలో తీవ్ర అలజడి..!
నేడు శ్రావణమాసం తొలి సోమవారం కావడంతో.. బీహార్ లోని లఖీసరాయ్ జిల్లాలో ఉన్న ప్రముఖ అశోక్ ధామ్ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ముఖ్యంగా ఉదయం 6.30 నుంచి 6.45 గంటల సమయంలో వరుసగా రెండు రైళ్లు స్టేషన్కు చేరుకోవడంతో.. వాటిల్లో వచ్చిన ప్రయాణికులు, భక్తులు ఒక్కసారిగా ఆలయం వైపు తరలివచ్చారు. దీంతో రద్దీ అనూహ్యంగా పెరిగింది. అధికా రుల అంచనాలకు మించి జనం పోటెత్తడంతో.. ఏర్పాటు చేసిన రక్షణ బారికేడ్లు విరిగిపోయాయి. ఇలా బారికేడ్లు విరిగిపోవడంతో క్యూలైన్లలో ఉన్న జనం గందరగోళంలో ఒకరిపై ఒకరు పడిపోయారని.. ఈక్రమంలోనే తొక్కిసలాట జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ తొక్కిసలాటలో మొత్తంగా ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని జిల్లా మేజిస్ట్రేట్ స్పష్టం చేశారు.
రంగంలోకి దిగిన అధికారులు
సమాచారం అందుకున్న జిల్లా పరిపాలనా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం సంఘటనా స్థలానికి వెళ్లారు. గాయపడిన 10 నుంచి 15 మంది బాధితులను అధికారులు సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వైద్య సహాయం అందించారు. మరోవైపు ప్రాణాలు కోల్పోయిన భక్తుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రి కి తరలించారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ.. స్థానికుల సహాయంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఆలయ ప్రాంగణంలో రద్దీని నియంత్రించేందుకు అదనపు బలగాల ను మోహరించి, అధికారులు పరిస్థితులను సమీక్షిస్తున్నా రు. పవిత్ర శ్రావణ సోమవారం జరిగిన ఈ విషాదం స్థానికంగా తీవ్ర విషాద ఛాయలను నింపింది. భక్తుల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. మరోవైపు సంఘటన స్థలానికి చేరుకున్న లఖీసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ప్రమాదానికి గల వివరాలను వెల్లడించారు. అలాగే బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.