సహిత విద్యను బలోపేతం చేయాలి
Åడీఈవో మాణిక్యం నాయుడు
అక్షర కిరణం, (విజయనగరం): క్షేత్రస్థాయిలో సహిత విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని జిల్లా విద్యాశాఖధికారి యు.మాణిక్యం నాయుడు అన్నారు. బుదవారం పీఎసఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జిల్లా సమగ్ర శిక్షా, విద్యాశాఖ ఆధ్వర్యంలో సహిత విద్యా విధానంపై మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీిఈఓ మాట్లాడు తూ పాఠశాలలో సాధారణ విద్యార్థులతో పాటు ప్రత్యేక అవ సరాలు కలిగిన విద్యార్థులు కూడా కలిసి చదువుకోవడమే సహిత విద్యా విధానం లక్ష్యమన్నారు. ఇందుకోసం ప్రభుత్వం పాఠశాలలో పలు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసిం దన్నారు. ప్రస్తుతం పాఠశాలలో కొత్తగా దివ్యాంగ విద్యార్థుల ను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రశస్త్ యాప్‌తో స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. దీంతోపాటు సాధారణ ఉపాధ్యాయులకు సహిత విద్యపై దీక్ష కోర్స్‌ను ఆన్లైన్లో అందిస్తున్నామన్నారు. ఈ రెండు కార్యక్ర మాలు క్షేత్ర స్థాయిలో అమలు జరిగేటట్లు ఏంఈఓలు పర్యవేక్షించాలని డీఈఓ సూచించారు. రిసోర్స్‌పŸర్సన్లు పి.సునీల్, కే. ఈశ్వరరావు సహిత విద్య విధానాలు, సమగ్ర శిక్ష ప్రాజెక్టు ద్వారా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు అందుతున్న సేవలను, ప్రశస్త యాప్, డిజిటల్ విద్యా విధానం తదితర విషయాలను తెలియజేశారు. జిల్లా సహిత విద్య కోఆర్డినేటర్ కె.రామారావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖధి కారులు పీ. రమణమ్మ, కే.మోహనరావు, ఎంఈవోలు, వైద్యాశాఖ, ఐసీడీిఎస్ ప్రతినిధులు, సహిత విద్య సహ కోఆర్డినేటర్ ఎం.భారతి, సమగ్ర శిక్షా జిల్లా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.