సీఈసీపై ప్రతిపక్షాల యుద్ధం
Åఇండియా కూటమి తీర్మానాలు Å2 నుంచి 8 వరకు సేవ్ డెమొక్రాటిక్ మార్చ్
అక్షర కిరణం, (ఢిల్లీ/జాతీయం): కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు సీఈసీపై యుద్ధం ప్రకటిం చాయి. న్యూఢిల్లీలో బుధవారం సమావేశమైన ఇండియా కూటమి పార్టీలు.. పలు ముఖ్యమైన తీర్మానాలు చేశాయి. అక్టోబరు 2 నుంచి 8 వరకు సేవ్ డెమొక్రాటిక్ మార్చ్ పేరుతో ధర్నాలు చేయాలని నిర్ణయించారు. అలాగే, కలెక్టరేట్ల వద్ద నిరసనలు కూడా చేపట్టనున్నారు. తక్షణమే పదవికి సీఈసీ రాజీనామా చేయాలని కూటమి డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీలో బుధవారం భేటీ అయిన ఇండియా కూటమి .. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా సహా కీలక తీర్మానాలు చేసింది. అక్టోబరు 2 నుంచి 8 వరకు సేవ్ డెమొక్రాటిక్ మార్చ్ , కలక్టరేట్ల వద్ద ధర్నాలు చేయాలని నిర్ణయించింది. అక్టోబరు 6న సీఈసీ కార్యాలయం ముట్టడికి పిలుపు, అక్టోబరు రెండో వారంలో రాష్ట్రపతిని కలిసే యోచన, దేశవ్యాప్తంగా ఐదు భారీ సభలు నిర్వహించాలని తీర్మానించారు. నవంబరు 1 ఢిలీ ్లలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసినట్టు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.
“అక్టోబరు 6న కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి ప్రతిపక్ష ఎంపీలందరం ర్యాలీగా వెళ్తాం.. వాస్తవానికి ఈరోజే ర్యాలీ చేపట్టాలని అనుకున్నా.. అందరూ హాజరు కావాలనే ఉద్దేశంతోనే వచ్చే నెల 6కు షెడ్యూల్ చేశాం” అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
అక్టోబర్ రెండో వారంలో ప్రతిపక్ష నాయకులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి, ఎన్నికల సంఘం, ప్రభుత్వం అక్రమాలపై వినతిపత్రాన్ని సమర్పిస్తారని ఖర్గే తెలిపారు. “రెండో వారంలో ప్రతిపక్ష నాయకులు భారత రాష్ట్రపతిని కలవడానికి అపాయింట్మెంట్ కోరతారు. ఈసీఐ, కేంద్ర ప్రభుత్వం చేసిన అవకతవకలపై మేము ఆమెకు వినతిపత్రం సమర్పిస్తాం” అని ఆయన అన్నారు.
ఎన్నికల ప్రక్రియ, పౌరుల హక్కులపై ప్రతిపక్షాల ఆరోపణ లను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఐదు భారీ ర్యాలీలను నిర్వహించాలని ఇండియా కూటమి యోచిస్తోందని ఖర్గే పేర్కొన్నారు. వీటి తేదీ, వేదికలను తరువాత ప్రకటిస్తామని చెప్పారు. “మేము ఐదు భారీ ర్యాలీలు నిర్వహిస్తాం.. కానీ తేదీ, ప్రదేశం తర్వాత నిర్ణయిస్తాం... ప్రభుత్వం ప్రజల ప్రాథ మిక హక్కులను ఎలా హరించివేస్తోందో దేశ ప్రజలకు తెలియజేయాలనుకుంటు న్నాం” అని ఖర్గే వివరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఓటు చోరీపై నవంబరు 1న ఢిల్లీలో ఒక భారీ ర్యాలీ కూడా నిర్వహిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు తెలిపారు. ప్రస్తుతం దేశంలో జరుగుతోన్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎసఐఆర్) ప్రక్రియ వివాదంపై తమ వ్యూహాన్ని చర్చించేందుకు ఇండియా కూటమి నాయకులు భేటీ అయ్యింది. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఈసీ, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్షాలు ఆరోపణలు చేశాయి.