రూ.55.74 కోట్లతో అరసవల్లి అభివృద్ధి
Åరాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
అక్షర కిరణం, (శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ సూర్యక్షేత్రమైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థాన సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ‘స్వదేశ్ దర్శన్-2.0’ పథకం కింద రూ. 55.74 కోట్ల భారీ ఎత్తున నిధులు మంజూరు చేయడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
ఈ నిధుల సాధన కోసం కేంద్ర స్థాయిలో ప్రత్యేక చొరవ చూపి అహర్నిశలు కృషి చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు నియో జకవర్గ ప్రజల తరఫున ఆయన హృదయపూర్వక కృతజ్ఞÔ áలు తెలియజేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంకల్పం, పట్టుదల వల్లే శ్రీకాకుళం జిల్లా ఆధ్యాత్మిక కీర్తి కిరీటమైన అరసవల్లి పుణ్యక్షేత్రం నేడు అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా సరికొత్త రూపు సంతరిం చుకుంటోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే, ఈ క్షేత్ర అభివృద్ధి ప్రాధాన్యతను గుర్తించి నిధుల విడుదలకు పూర్తి సహకారం అందించిన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఆలయాల ఆధునీకరణకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అచ్చెన్నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటు లోకి రానున్న నేపథ్యంలో, దేశ విదేశాల నుంచి అరసవల్లికి విచ్చేసే భక్తులు, యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరగ నుందని.. ఈతరుణంలో మంజూరైన ఈ నిధులు ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి సరికొత్త బాటలు వేస్తాయని ఆయన పేర్కొన్నారు..