మాధవస్వామి ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు
అక్షర కిరణం, (మాధవధార): మాధవధారలో వెలిసిన మాధవ స్వామి ఆలయంలో శనివారం ఆలయ అర్చకులు గోవిందస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం శనివారం కావడంతో వేకువ జాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందించారు. అనంతరం మాధవధార, మురళినగర్ పరిసర ప్రాంతాలలో వేద పారాయణ గురువు విజయలక్ష్మి ఆధ్వర్యంలో సుమారు 50 మంది మహిళలు కలిసి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, గీతా పారాయణాన్ని పఠించారు. అనంతరం అర్చకులు గోవిందస్వామిని రామా నుజ శిష్యులు సీపాన ప్రసాద్, మూర్తి సత్కరించి ఆశీర్వచ నాలు అందుకున్నారు. వేదపారాయణ గురువు విజయలక్ష్మి ను మహిళలు గౌరవంతో సత్కరించారు. ఈ సందర్భంగా అర్చకులు గోవిందస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యా త్మిక చింతనతో మెలగాలని, ఆధ్యాత్మిక భావనతో ప్రజలు మెలిగేటప్పుడు జీవితం సుఖసంతోషాలతో ముందుకు వెళుతుందని, భగవంతుడు కల్పించిన జీవితం సంతృప్తి కరంగా ముందుకు సాగాలని, భక్తి మార్గంలో నడుచుకొని పలు వురికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్నం నుంచి ఆలయ ఆవరణలో నారాయణ సేవ నిర్వహిం చారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు విచ్చేసేసరికి ఆలయమంతా గోవింద నామస్మరణతో మారుమోగింది.