ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త
Å12 పీఆర్సీ నియామకానికి ఆమోదం
అక్షర కిరణం, (అమరావతి): రాష్ట్ర ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వేతన సవరణ సంఘం (Pay =వఙఱsఱశీఅ ్పుశీఎఎఱssఱశీఅ -P్పు=) ఏర్పాటుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుతో పాటు మరికొన్ని సమస్యల పరిష్కారానికి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. క్యాంప్ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సమావేశమ య్యారు. ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ.. ముఖ్యమంత్రితో భేటీ సందర్బంగా చర్చించిన విషయాలు, తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా 12 పీఆర్సీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సూర్యానారాయణ తెలిపారు. 2026 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రెండు డీఏల చెల్లింపునకు అంగీకరించినట్లు తెలిపారు. అలాగే సరెండర్ లీవ్స్ (పోలీసులకు అదనంగా సరెండర్ లీవ్) వేసేందుకు ఆమోదించినట్లు తెలిపారు. రిటైర్ అయిన ఉద్యోగులకు అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్‌ను 2027 జనవరి నుంచి ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. మరోవైపు అక్టోబర్ ఒకటి నుంచి రెండు డీఏలు చెల్లించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.. 1-7-2024, 1-1-2025 డీఏలు విడుదల చేయనుంది.
ఇక 2022కు సంబంధించిన సరెండర్ లీవ్స్‌ను 2027 సంక్రాంతికి అకౌంట్లో వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. పోలీస్ సిబ్బందికి ఒక అడిషనల్ సరెండర్ లీవ్ ఈ విజయదశమికి చెల్లించనున్నారు. రిటైర్ అయిన వారికి జనవరి 2027 నుంచి అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ఇవ్వనుండగా.. 70 సంవత్సరాలు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం చొప్పున అందించనున్నారు.
మరోవైపు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచఎస్) బకాయిలను వచ్చే నెల నుంచి ఏ నెలకు ఆ నెల చొప్పున ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కి చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. మరోవైపు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులుగా చేర్చాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఉద్యోగ సంఘాల నేత విద్యాసాగర్ తెలిపారు. అలాగే స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బందికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
మరోవైపు సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. తాజా నిర్ణయాలతో ప్రతి ఏడాది రూ.2880 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా.