ఉత్తరాంధ్రలో కొత్తగా 2 వేల ఎకరాల్లో మరో పోర్టు
Åకేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
అక్షర కిరణం, (ఇచ్ఛాపురం): ఉత్తరాంధ్రలో కొత్తగా మరో పోర్టు ఏర్పాటు కాబోతోందన్నారు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఇచ్చాపురం నియో జకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించామని.. 2వేల ఎకరాల్లో తీర ప్రాంతంలో పోర్టు నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని తెలి పారు. ఇచ్చాపురంలో పోర్టు నిర్మాణంతో పెద్ద ఎత్తున అనుబంధ పరిశ్రమలు, సంస్థలు వస్తాయన్నారు. అలాగే ఇచ్ఛాపురంలో మరో రైల్వేవంతెన కోసం ప్రయత్నిస్త్తున్నామ న్నారు. రామ్మోహన్ నాయుడు ఇచ్ఛాపురం నియో జకవర్గంలోని కంచిలి మండలం పోలేరు పంచాయతీ పరిధిలో 1.31 కోట్లతో రెండు బిటి రోడ్లు ప్రారంభోత్సవం, రూ.6 కోట్లతో రెండు రైల్వే అండర్‌బ్రిడ్జిలు, రూ.2.29కోట్ల తో రాజావారి మైదానంలో బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, రాజపురంలో 20లక్షల నిధులతో సామాజిక భవనాలకు శంకు స్థాపన చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గం లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ , కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి శ్రీకారం చుట్టామన్నారు రామ్మోహన్ నాయుడు. ఇచ్చాపురం రాజావారి మైదానం లో అన్ని వసతులతో బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. రెండు ఆర్వోబీ లకు శంకుస్థాపన చేశామని.. ఇక ఇబ్బందు లు తొలగిపోతాయన్నారు. అమృత్ భారత్ పథకంలో ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌ను ఆధుని కీకరిస్తున్నామని.. కొత్తగా రైల్వే హాల్ట్‌లు కూడా తీసుకొచ్చామని గుర్తు చేశారు.
అంతేకాదు రైల్వేజోన్ మార్పు చాలా గొప్ప నిర్ణయమని.. ఇకపై రైల్వే సమస్యలపై నేరుగా డీఆరఎంకు కలిసే అవకాశం దొరికిందన్నారు రామ్మోహన్ నాయుడు. ఏళ్ల తరబడి రోడ్లు లేని గ్రామాలకు బీటీ రోడ్డు, సీసీ రోడ్డు పనులు చేపట్టామని.. ఐదేళ్లుగా ఆగిపోయిన ఇచ్ఛాపురం కేవీకేకు శంకుస్థాపన చేశామన్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల లోనూ కేవీకేలు మంచి ఇన్ఫ్రాస్టెక్చర్తో స్టేడియాలు నిర్మిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు అందిస్తూ వారి అభ్యున్నతికి కట్టుబడి ఉంద న్నారు. ఏపీకి రామ్మోహన్ నాయుడు మరో శుభవార్త చెప్పారు. సెప్టెంబర్ 26న రాష్ట్రంలో మొట్టమొదటి ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఖీTO) ప్రారంభం కానుందని తెలిపారు. ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ కర్నూలు విమానాశ్రయంలో ఫ్లయింగ్ శిక్షణను ప్రారంభించడానికి సిద్ధంగా ఉందన్నారు. పైలట్ శిక్షణ మౌలిక సదుపాయాలను పెంపొందించడంలో ఇది మరో మైలురాయి అంటూ ట్వీట్ చేశారు